‘రైతు పోరాటాలకు కార్మిక వర్గం సంపూర్ణ మద్దతు’
నల్లగొండలో ఈ నెల 15 నుండి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను, బహిరంగ సభను కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం.డి.సలీం పిలుపునిచ్చారు.
– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి
రామగిరి, నవంబర్ 10 : నల్లగొండలో ఈ నెల 15 నుండి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను, బహిరంగ సభను కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం.డి.సలీం పిలుపునిచ్చారు. మహాసభలకు సంఘీభావంగా నల్లగొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద గడియారం సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నల్లగొండలో జాతీయ రైతు మహా సభలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రైతాంగ పోరాటాలకు కార్మిక వర్గం అండగా ఉంటుందని, కార్మిక–కర్షక ఐక్యతతో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా కార్యదర్శి సయ్యద్ హషం, లకపాక రాజు, దండెంపల్లి సత్తయ్య, అవుట రవీందర్, అద్దంకి నరసింహ, యూనియన్ అధ్యక్షుడు అవురేశు మారయ్య, కార్యదర్శి లక్ష్మీపతి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | గురుకుల హాస్టల్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ.. వీడియో
‘రైతు పోరాటాలకు కార్మిక వర్గం సంపూర్ణ మద్దతు’
Nirmal Rythu Garjana | నిర్మల్ రైతు గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల, బీఆర్ఎస్ నేతలు
Sonia Gandhi | ‘నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓకే చెప్పా’.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

