మిర్యాలగూడ, ఏప్రిల్ 28: సమాజంలో ప్రతి ఒక్కరూ దైవభక్తిని కలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో నిర్వహించిన బంగారు మైసమ్మతల్లి పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు జ్ఞాపకార్థం ఆయన కుటుంబస భ్యులు ఏర్పాటు చేసిన అన్నదానం ప్రారంభించారు.
ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, కౌన్సిలర్ కుర్ర చైతన్య, పార్టీ సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున, ఏఎంసీ మాజీ ఛైర్మన్ చిట్టిబాబునాయక్, వైస్ ఛైర్మన్ యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వింజం శ్రీధర్, నూనె రవికుమార్, దొనేటి సైదులు, చిరంజీవి, ప్రవీణ్, షహీద్, సైదులు, భిక్షం, దయాకర్‌రెడ్డి, హరీశ్ పాల్గొన్నారు.