ఆత్మకూరు(ఎం), మే24 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆత్మకూర్.ఎం మండల కేంద్రంలో శుక్రవారం పట్టభద్రులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు.
నిరుద్యోగులకు న్యాయం జరుగాలంటే రాకేశ్‌రెడ్డిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఎన్నికల ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నాయకులు సుదగాని హరిశంకర్‌గౌడ్, తుంగ బాలు, కొరె భిక్షపతి, నాగరాజు, పరశురాములు, సతీశ్, విశాల్, వినయ్, మణికుమార్, మహేశ్, వంశీకృష్ణ, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.