ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయే
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అరాచకాలను జనం చూస్తున్నారని, అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని వారికి అర్థమైందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్‌రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలెప్పుడూ మరవలేదని, మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని అన్నారు.
- అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రజలకు అర్థమైంది
- రెండేళ్ల కాంగ్రెస్ పాలనలోని అరాచకాలను జనం చూస్తున్నారు
- బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ మాజీ కౌన్సిలర్లు
- పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 2: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అరాచకాలను జనం చూస్తున్నారని, అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని వారికి అర్థమైందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్‌రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలెప్పుడూ మరవలేదని, మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని అన్నారు. సూర్యాపేటకు చెందిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ కట్కూరి కార్తీక్‌రెడ్డి, 27వ వార్డు మాజీ కౌన్సిలర్ సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు, సిరివెళ్ల శబరి, 17వ వార్డుకు చెందిన వందలాది మంది కార్యకర్తలతో సోమవారం పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పెంచి పోషించేది రౌడీయిజం, పందులు, దోమలేనన్నారు. అందుకే ప్రజలు ఆలోచన చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
నాడు 30 ఏళ్లు మూసీ మురికి నీటిని తాగించింది కాంగ్రెస్సేనని, ఎట్లున్న సూర్యాపేటను ఎట్లా అభివృద్ధి చేసినమో ప్రజలకు తెలుసన్నారు. పదేళ్లలో సూర్యాపేట ప్రశాంతంగా ఉందని, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరికీ అర్థమైందని అందుకే భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఇస్లావత్ రాం చందర్ నాయక్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, గండూరి ప్రకాశ్, నిమ్మల శ్రీనివాస్, మారిపెద్ది శ్రీనివాస్, కక్కిరేణి నాగయ్య, బూర బాలసైదులు, బొమ్మగాని శ్రీనివాస్, కక్కిరేణి సత్యనారాయణ, పల్స వెంకన్న, జీడి భిక్షం, గాలి సాయి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

