తక్కువ ధరకే వ్యవసాయ యంత్రాలు
కూలీల కొరతను అధిగమించి, అధిక దిగుబడులు సాధించాలంటే సాగులో నేడు యంత్రాల వినియోగం అనివార్యమైంది. ఈ క్రమంలోనే సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ సహకారంతో మండల సమాఖ్యలు కృషి చేస్తున్నాయి
- మండల సమాఖ్యల ఆధ్వర్యంలో సీహెచ్‌సీ ఏర్పాటు
- నూతనకల్, నేరేడుచర్ల, మునగాలలో ప్రయోగాత్మకంగా అమలు
- ఇప్పటికే రూ.75 లక్షలతో మూడు వరి కోత యంత్రాల కొనుగోలు
- రైతులకు అద్దెకు ఇస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న మహిళలు
నూతనకల్, ఏప్రిల్ 17 : కూలీల కొరతను అధిగమించి, అధిక దిగుబడులు సాధించాలంటే సాగులో నేడు యంత్రాల వినియోగం అనివార్యమైంది. ఈ క్రమంలోనే సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ సహకారంతో మండల సమాఖ్యలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ (సీహెచ్‌సీ) ఏర్పాటు చేసి రైతులకు బాసటగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో వరి కోత మిషన్లను సమకూర్చుకుని మహిళా సమాఖ్య సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మార్కెట్ కంటే తక్కువ ధరకే రైతులకు అద్దెకు ఇచ్చి పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తున్నారు.
అద్దె తక్కువ..
రైతులపై కూలీల భారం తగ్గించడానికి ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా జీవనోపాధుల మిషన్ కింద కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో వరి కోత యంత్రాల కొనుగోలుకు బ్యాంకు ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నది. సంఘాలు తీసుకున్న రూ.25 లక్షల రుణాన్ని నిబంధనల మేరకు నిర్ణీత గడువులోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో నూతనకల్, నేరేడుచర్ల, మునగాల మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో సమాఖ్య రూ.25 లక్షల చొప్పున రుణం తీసుకొని వరి కోత యంత్రాలను గత సంవత్సరం యాసంగిలో కొనుగోలు చేశాయి. మార్కెట్ ధర కంటే తక్కువకే రైతులకు అద్దెకు ఇస్తున్నారు. ఫోర్వీల్కు మార్కెట్లో గంటకు రూ.2200 తీసుకుంటుండగా.. మండల సమాఖ్య వారు రూ.2వేలు మాత్రమే వసూలు చేస్తున్నారు.
మరిన్ని కొనుగోలు చేసే యోచన
మహిళా సమాఖ్యలు సీహెచ్‌సీ నిర్వహణకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేసుకుని డ్రైవర్, సూపర్వైజర్లను తాత్కాలికంగా నియమించుకున్నాయి. వారి వేతనాలు, యంత్రాల నిర్వహణకు అద్దె డబ్బు నుంచే చెల్లిస్తున్నారు. సొంత భవనం, అదనపు యంత్రాలను సమకూర్చుకుంటే చిన్న, సన్నకారు రైతులకు మరింత అండగా ఉంటుంది. యంత్రాల అద్దెకు డిమాండ్ ఎక్కువగా ఉంటే మరిన్ని కొనుగోలు చేసే యోచనలో ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులకు సీహెచ్‌సీలో లభించే అద్దె మిషన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. జిల్లాలో మరో మూడు మండలాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఆత్మకూర్(ఎస్), మోతె, తుంగతుర్తి మండల మహిళా సమాఖ్య నాయకులు జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపారు. వచ్చే వానకాలం నాటికి అందుబాటులోకి తేనున్నారు.
సూచనలు చేస్తున్నాం
స్త్రీ నిధి ద్వారా మహిళా సమాఖ్య సభ్యులకు పైలెట్ ప్రాజెక్టుగా కస్టమ్ హైరింగ్ సెంటర్ మంజూరైంది. ఈ కేంద్రంలో వరి కోత యంత్రాన్ని సమకూర్చుకున్నారు. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో ఎప్పటికప్పుడు మహిళా సమాఖ్య సభ్యులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం.
– ఏపీఎం, కర్ణాకర్, నూతనకల్
సమష్టి కృషితో నడుపుతాం
మహిళా సమాఖ్యల బలోపేతానికి కృషి చేస్తున్న ప్రభుత్వం.. అద్దె యంత్రాల కొనుగోలుకు వడ్డీ లేని రుణం అందిస్తున్నది. ఆ డబ్బుతో హార్వెస్టర్లు కొనుగోలు చేసి రైతులకు కిరాయికి ఇస్తున్నాం. వచ్చిన డబ్బులను పొదుపు చేస్తున్నాం. సభ్యులందరం సమష్టి కృషితో నడుపుకోవాలని నిర్ణయించుకున్నాం. అద్దెతోపాటు ఇతర పనుల కోసం ఒక వ్యక్తిని నియమించి జీతం ఇస్తున్నాం.
– ఏర్పుల రామతార, మండల సమాఖ్య అధ్యక్షురాలు, నూతనకల్
మరో మూడు ప్రతిపాదనలు వచ్చాయి
జిల్లాలో ఆత్మకూర్(ఎస్), మోతె, తుంగతుర్తి మండలాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభించడానికి ప్రతిపాదనలు పంపాం. వీటితో మహిళా సంఘాలకు పొదుపుతోపాటు రైతులకు లబ్ధి చేకూరుతుంది. కూలీల కొరతను అధిగమించడానికి వరి కోత మిషన్లు దోహదపడుతాయి.
– సుందరి కిరణ్‌కుమార్, డీఆర్డీఓ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

