‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
ఎల్‌నినో ప్రభావం కారణంగా యాసంగి సీజన్లో వర్షపాతం తగ్గి, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని చండూరు మండల వ్యవసాయ అధికారి పి.మల్లేష్ అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి, కస్తాల గ్రామాలలో...
– చండూరు మండల వ్యవసాయ అధికారి పి.మల్లేష్
చండూరు, అక్టోబర్ 13 : ఎల్‌నినో ప్రభావం కారణంగా యాసంగి సీజన్లో వర్షపాతం తగ్గి, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని చండూరు మండల వ్యవసాయ అధికారి పి.మల్లేష్ అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి, కస్తాల గ్రామాలలో దిగుబడి తగ్గి నష్టం జరిగిన పలు పత్తి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. భూగర్భ జలాలు తగ్గే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నీటి లభ్యత ఆధారంగానే పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు.
అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా శనగ,జొన్న , పెసర,మొక్కజొన్న మినుము, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయడం ద్వారా నీటిని ఆదా చేయడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.రైతులు తమ భూముల స్వభావం, నేలలో తేమ, అందుబాటులో ఉన్న నీటి వనరులు, స్థానిక వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు అనుకూలమైన పంట రకాలను ఎంపిక చేసుకోవాలని, అవసరమైన మేరకే ఎరువులు, పురుగుమందులు వినియోగించాలని సూచించారు.
నీటి పొదుపు పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలని కోరారు.యాసంగి సాగులో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడం, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను నివారించడం ప్రధాన లక్ష్యాలుగా రైతులు ముందుకు సాగాలని వ్యవసాయ అధికారి సూచించారు. పంటల ఎంపిక విషయంలో సందేహాలు ఉన్న రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు నాగార్జున, మహేష్, తుమ్మలపల్లి గ్రామ సర్పంచ్ బోయపల్లి రాజేష్, గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

