‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగి పంటల సాగు ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని గడ్డిపల్లి వ్యవసాయ శాస్త్రవేత్త ఆదర్శ్ రైతులకు సూచించారు. అనంతగిరి మండలంలోని వాయిలసింగవరం గ్రామంలో రైతులకు పంటలపై అవగాహన కల్పించేందుకు...
– గడ్డిపల్లి వ్యవసాయ శాస్త్రవేత్త ఆదర్శ్
అనంతగిరి, అక్టోబర్ 29 : వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగి పంటల సాగు ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని గడ్డిపల్లి వ్యవసాయ శాస్త్రవేత్త ఆదర్శ్ రైతులకు సూచించారు. అనంతగిరి మండలంలోని వాయిలసింగవరం గ్రామంలో రైతులకు పంటలపై అవగాహన కల్పించేందుకు గురువారం ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే పరిస్థితులు ఏర్పడితే భూగర్భ జలాలపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు.
వరి పంటకు అధిక మొత్తంలో నీరు అవసరమవుతుందని నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు చేయడం వల్ల పంట మధ్యలో నీటి కొరత ఏర్పడి దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. రైతులు తమ భూముల స్వభావం నేలలోని తేమ నీటి లభ్యతను బట్టి అనువైన ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పంట మార్పిడి విధానాన్ని పాటించడం, భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించడం, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించడం ద్వారా నేల సారవంతాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించాలని తెలిపారు.

‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ఏఓ సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా రైతులు పంటలు వేసుకోవాలని కోరారు. సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు మాట్లాడుతూ భూగర్భ జలాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నీటి వనరులను పొదుపుగా వినియోగిస్తూ రైతులు పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో నీటి వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో అన్వేష్, హెచ్ ఈ ఓ ఇస్మాయిల్, పంచాయితీ కార్యదర్శి సౌమ్య, రైతులు కొల్లు సుబ్బారావు ,గద్దె రామారావు, దేవులపల్లి నరసింహరావు, రేవూరి శ్రీనివాసరావు, గుండ్లపల్లి వెంకన్న, గూడపురి కోటయ్య, కొరివి వెంకటేశ్వర్లు, బుర్రా వీరబాబు, దాములూరి సత్యనారాయణ, వీరబోయిన సైదులు, బుర్రా నాగమల్లేశ్వరరావు, నేరెళ్ళ చంద్రయ్య, మల్లెబోయిన మల్సూరు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
Kidney health | కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..!
నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Harish Rao | మల్లన్నసాగర్‌కు అతీ సమీపంలో బ్లాస్టింగ్లు.. ప్రమాదంలో రిజర్వాయర్ : మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన
Bigg Boss | బిగ్ బాస్ హౌస్‌లో ఇన్ని ఇబ్బందులా .. షో వెనుక అసలు విషయాలు బయటపెట్టిన దక్షి!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

