Interview | గులాబీ జెండాకేప్రజా మద్దతు.. పదేండ్లలో ఏ పార్టీ ఇంతగా చేయలేదు: నల్లమోతు భాస్కర్‌రావు
Interview | ‘స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు ప్రగతిలో దూసుకు పోతున్నాయి. గతంలో ఏ పార్టీ కూడా ఇంతలా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.2,492 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. దామరచర్లలో ప్రతిష్టాత్మకంగా రూ.30వేల కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నది.
Interview | ‘స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు ప్రగతిలో దూసుకు పోతున్నాయి. గతంలో ఏ పార్టీ కూడా ఇంతలా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.2,492 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. దామరచర్లలో ప్రతిష్టాత్మకంగా రూ.30వేల కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్నది. సీఎం కేసీఆర్ పాలనకు ప్రజల మద్దతు పెరిగింది. ఆయనతోనే అభివృద్ధి సాధ్యమని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఏ పార్టీ సాటి రాదు. ప్రజల అండ, సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మూడోసారి విజయం సాధించి మరింత అభివృద్ధికి కృషి చేస్తా’ అని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. నమస్తే తెలంగాణ ఇంటర్య్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
నమస్తే : మరోసారి ఎమ్మెల్యే టికెట్ రావడంపై మీ స్పందన ఏమిటి?
ఎమ్మెల్యే : సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేయడమే కాకుండా అనేక పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా కృషి చేశాను. నేను చేస్తున్న సేవలకు గుర్తింపుగానే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. నా పనితీరుకు ఇదే నిదర్శనం.
నమస్తే : పార్టీ శ్రేణుల స్పందన ఎలా ఉంది?
ఎమ్మెల్యే : మొదటి నుంచీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ సేవలు చేస్తున్నా. కార్యకర్తలంతా మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. భారీ మెజారిటీతో గెలిపించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు.
నమస్తే : ఎన్నికల ప్రచారం ఎప్పుడు ప్రారంభిస్తారు?
ఎమ్మెల్యే : నేను ఎప్పుడైనా ప్రజల్లో ఉండే మనిషిని. ప్రజల కష్టాలను తెలుసుకోవడం నా అభిమతం. ప్రజలంతా నా ఆత్మీయులు అనే భావనతోనే ముందుకు వెళ్తున్నా. ప్రచారం నాతోపాటు నా ఆత్మీయులంతా ఈపాటికే మొదలు పెట్టారు.
నమస్తే : ఎన్నికల్లో ప్రచార అస్ర్తాలు ఏంటి?
ఎమ్మెల్యే : రైతుబంధు ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.72,815 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి రైతులకు ఆసరాగా నిలిచింది సీఎం కేసీఆర్ మాత్రమే. మిర్యాలగూడ నియోజకవర్గంలో 59,840 మంది రైతులకు రూ.646.72కోట్లను అందించారు. రైతుబీమా ద్వారా నియోజకవర్గంలో 157 మందికి రూ.7.85కోట్ల బీమా అందించి ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. పేదలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు, ఇంటింటికీ రక్షిత మంచినీరు.. ఆసరా పింఛన్లు, అన్ని రకాల కుల వృత్తుల వారికి చేయూత అందించాం. ఇవన్నీ మా ప్రచార అస్ర్తాలే.
నమస్తే : ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి?
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న వంద పడకల ఆసుపత్రిని 200 పడకల స్థాయికి పెంచడం జరిగింది. దీనికి నూతన భవన నిర్మాణానికి రూ.16కోట్లు మంజూరు చేయించాను. ఈ పనులు త్వరగా పూర్తి చేసి మరో 50 పడకల భవన నిర్మాణానికి నిధులు సమీకరిస్తా. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని జిల్లా దవాఖాన స్థాయికి తీసుకెళ్లి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నా.
నమస్తే : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలైనట్లేనా?
ఎమ్మెల్యే : గత ఎన్నికల్లో ఇంటింటికీ మంచినీరు అందించడం, అన్ని గ్రామాలకు లింకు రోడ్లు, నియోజకవర్గం నుంచి మండల కేంద్రాలకు డబుల్ రోడ్లు, కొత్తగా ఏర్పాటైన తండాల అభివృద్ధి వంటి హామీలు ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు పూర్తి చేయించా. మరికొన్ని జరుగుతున్నాయి.
నమస్తే : ఈ ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వాలనుకుంటున్న హామీలు ఏంటి?
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరు చేయించడం, బీసీ బంధు కింద రూ.లక్ష సాయం, అన్ని దళిత కుటుంబాలకు దళితబంధు అందించడం సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యం. ఈ పథకాలన్నీ నిరంతర ప్రక్రియలో భాగమే. యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో డిసెంబర్‌లోపు రెండు యూనిట్లు ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఈలోపు ఎన్నికల కోడ్ వస్తే అనంతరం ప్రారంభిస్తాం. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నియోజకవర్గంలో యువతకు ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహించి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. మున్ముందు మరింత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తా.
నమస్తే : ప్రధాన పోటీ ఎవరితో ఉండొచ్చు?
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, ఇతర పార్టీల నుంచి ఎవరు నిలబడినా నేను హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం. వార్ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. గతం కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తాను. ప్రత్యర్థి ఎవరనేది చూడను. భారీ మెజారిటీయే నా ప్రధాన లక్ష్యం.
నమస్తే : నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు?
ఎమ్మెల్యే : మిర్యాలగూడ నియోజకవర్గం ఏర్పడి ఇప్పటికి 66 సంవత్సరాలు. నేను ఎమ్మెల్యేగా చేసిన ఈ పదేండ్లలో వేల కోట్లతో అభివృద్ధి చేశాను. 56 సంవత్సరాల్లో ఎంతో మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. ఎవరూ నియోజకవర్గ అభివృద్ధి పట్ల దృష్టి సారించలేదు. మేము ప్రతి గ్రామం, తండాలో బీటీ రోడ్లు వేశాం. అన్ని గ్రామాలకు తాగునీటి వసతి కల్పించాం. గతంలో జరిగిన, ఇప్పుడు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

