పండిట్, పీఈటీల సర్టిఫికెట్ల పరిశీలన
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పండిట్, పీఈటీలను అప్‌గ్రెడేషన్ చేస్తామని చెప్పింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆదివారంతో ముగియడంతో జిల్లా వ్యాప్తంగా ఆయా కేటగిరీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సోమవారం నల్లగొండ డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు.
- డీఈఓ కార్యాలయంలో సజావుగా అప్‌గ్రెడేషన్ ప్రక్రియ
రామగిరి, జూన్ 10 : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పండిట్, పీఈటీలను అప్‌గ్రెడేషన్ చేస్తామని చెప్పింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆదివారంతో ముగియడంతో జిల్లా వ్యాప్తంగా ఆయా కేటగిరీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సోమవారం నల్లగొండ డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. పండిట్స్, పీఈటీలు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీసు పుస్తకంతో వచ్చారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో భాషా పండిట్లు, పీఈటీలు 728 మంది పనిచేస్తున్నారు.
వీరిలో లాంగ్వేజ్ పండిట్.. తెలుగు -204, హిందీ -153, ఉర్దూ -7, పీఈటీ -124 మంది ఉన్నారు. కేటగిరీల వారీగా పుట్టిన తేది, విద్యార్హతలు, ఉద్యోగంలో చేరిన తేది, అదనపు విద్యార్హతల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించి ఉపాధ్యాయుల సంతకాలు తీసుకున్నారు. అప్‌గ్రెడేషన్‌కు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో రావడంతో డీఈఓ కార్యాలయ ఆవరణ కిక్కిరిసిపోయింది. తొలుత రెండు కౌంటర్స్ మాత్రమే ఏర్పాటు చేసి సర్టిఫికెట్స్ పరిశీలన చేయగా తోపులాట జరుగడంతో డీఈఓ భిక్షపతి మరో మూడు కౌంటర్స్ ఏర్పాటు చేయించారు. డీఈఓతోపాటు నల్లగొండ ఆర్డీఓ రవి పరిశీలన కౌంటర్స్ వద్ద ఉండి వెరిఫికేషన్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

