డీసీసీబీ చైర్మన్‌పై అవిశ్వాసం
నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఎన్నికలకు మరో ఏడు నెలలే గడువున్నా చైర్మన్ కుర్చీని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కొన్ని రోజులు ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు.
- డీసీఓకు నోటీసు అందజేసిన 14 మంది డైరెక్టర్లు
- ఈ నెల 20న అవిశ్వాసానికి ఓకే
నల్లగొండ ప్రతినిధి, జూన్10(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఎన్నికలకు మరో ఏడు నెలలే గడువున్నా చైర్మన్ కుర్చీని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కొన్ని రోజులు ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇందులో కీలక వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డిని చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
అందులో భాగంగా సోమవారం డీసీసీబీకి చెందిన 14 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాన ప్రతిపై సంతకం చేసి జిల్లా సహకార అధికారి కిరణ్‌కుమార్‌కు లేఖ అందజేశారు. వారంతా ఆదివారం రాత్రే కలుసుకుని నేరుగా నల్లగొండకు బస్సులో చేరుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఉండే జిల్లా సహకార అధికారికి కార్యాలయానికి వెళ్లి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన లేఖను అందజేశారు. ఈ విషయంలో అధికారులు కూడా వెంటనే స్పందించడం గమనార్హం. సోమవారం సాయంత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఈ నెల 20న గడువుగా ప్రకటించడం విశేషం.
అవిశ్వాస తీర్మానం వెనుక మంత్రుల ఒత్తిడి ఉండడంతో వెంటనే తేదీ నిర్ణయించారన్న చర్చ సాగుతున్నది. వాస్తవంగా 2020 ఫిబ్రవరిలో సహకార ఎన్నికలు జరిగాయి. ఇందులో బీఆర్ఎస్కు చెందని వారే 90 శాతానికిపైగా చైర్మన్లుగా ఎన్నికయ్యారు. అందులో నుంచి మొత్తం 19 మంది డీసీసీబీ డైరెక్టర్లకు గానూ 18 మంది బీఆర్ఎస్ వాళ్లే ఎన్నికయ్యారు. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకైక డైరెక్టర్‌గా ఉన్నారు. తదనంతర పరిణామాలు, అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఎక్కువ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం వంటి వాటితో బీఆర్ఎస్కు చెందిన డీసీసీబీ డైరెక్టర్లలో కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇదే అదునుగా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిని సైతం కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్ కీలక నేతలు ఒత్తిడి చేశారు. చైర్మన్ పదవి పోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్‌లో చేరేది లేదని మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ పెద్దలకు కరాఖండిగా తేల్చిచెప్పారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీలోనే తాను పని చేసినా 23 ఏండ్లుగా బీఆర్ఎస్తో వీడదీయలేని బంధం ఏర్పడిందని, పార్టీ అధినేత కేసీఆర్ తమను కుటుంబసభ్యులుగా భావిస్తారని, తమకు అత్యున్నత పదవులు కట్టబెట్టి ఆశీర్వదించారని మహేందర్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తన చైర్మన్ పదవిని కాపాడుకోవడం కోసం పార్టీకి ద్రోహం చేయలేనని కాంగ్రెస్ పెద్దలకే స్పష్టం చేసినట్లు తెలిసింది.
దాంతో కాంగ్రెస్ ముఖ్యులు మహేందర్‌రెడ్డిపై కక్షగట్టి, డీసీసీబీ చైర్మన్ పదవి నుంచి దింపాలని ఆవిశ్వాసాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. కొద్దిరోజులుగా మిగతా డైరెక్టర్లను ప్రలోభపెడుతూ ఆవిశ్వాసానికి మద్దతు కూడగట్టారు. మొత్తం 19 మంది డైరెక్టర్లలో 14 మంది మద్దతుతో సోమవారం అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలంటూ డీసీఓకు లేఖ అందజేశారు. దాంతో ఈ నెల 20న అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు అందరికీ లేఖలు పంపించనున్నారు. ఇక మరోవైపు అవిశ్వాస తీర్మానానికి లేఖను అందజేసిన డైరెక్టర్లు అంతా కుంభం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో క్యాంప్‌నకు తరలినట్లు తెలిసింది. కర్నాటకకు వెళ్లి అక్కడి నుంచి పర్యాటక ప్రాంతాల్లో క్యాంప్ కొనసాగించనున్నట్లు సమాచారం.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

