‘కాళేశ్వరాన్ని నిండా ముంచే ప్రయత్నం చేసిన కాంగ్రెస్’
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వేసిన ఘోష్ కమిషన్ చెల్లదని ఇది రాజ్యాంగ విరుద్దంగా ఉన్న కమిషన్ అని కేసీఆర్, హరీష్ రావులపై చేసిన ఆరోపణలు చెల్లవని హైకోర్టు తీర్చు ఇవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టని..
– మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట, ఏప్రిల్ 23 : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వేసిన ఘోష్ కమిషన్ చెల్లదని ఇది రాజ్యాంగ విరుద్దంగా ఉన్న కమిషన్ అని కేసీఆర్, హరీష్ రావులపై చేసిన ఆరోపణలు చెల్లవని హైకోర్టు తీర్చు ఇవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఏ ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడడని నేడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సెక్షన్ 80, 8బి ప్రకారం చట్ట విరుద్ధంగా కేసీఆర్, హరీష్ రావులపై నిందారోపణలు చేయడం తగదని హైకోర్టు తీర్పు చెప్పడం జరిగిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి, నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలు తప్పుడు మాటలని ఈ తీర్చుతో తేలిపోయిందన్నారు. పీసీసీ రూపొందించిన ఈ ఘోష్ కమిషన్ కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా మారి లేని పోని ఆరోపణలు చేశారన్నారు.
కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదని 210 కి.మీ సొరంగం, బ్యారేజులు, లిప్టులు, కెనాల్స్ కాళేశ్వరంలో భాగమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు అయింది రూ.94 వేల కోట్లని వారే చెప్పి ఇప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం సరికాదన్నారు. అసలు మేడిగడ్డ నిర్మాణానికి అయింది రూ.3,800 కోట్లని అక్కడ ఒక పిల్లర్ కూలితే దాన్ని ఏడీఈ కి అప్పగించినా పది రోజుల్లో రిపేరు చేసేవారని దాన్ని కూల్చి చూపించి కాళేశ్వరం కూలింది ఇది కూళేశ్వరం అని చెప్పి కాళేశ్వరాన్ని నీట ముంచే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందన్నారు. నేడు మెదక్, మహబూబ్నగర్ జిల్లాలకు కాళేశ్వరం ద్వారా నీరు అందిందని ఒక్క సూర్యాపేట జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల్లో రైతులు 9 సీజన్లలో పంటను పండించారన్నారు. ఈ రెండేళ్ల నుండి కాళేశ్వరం నీళ్లొస్తే కేసీఆర్ గుర్తొస్తడని కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఇప్పటికైనా ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని అయినా పట్టించుకునే పాపానపోవడం లేదన్నారు. ఇవాళ యాసంగి, వానాకాలం పంటలకు నీటి కోరత లేకుండా రెండు పిల్లర్లను బాగు చేసి వెంటనే కాళేశ్వరం నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
కేసీఆర్ పై కక్షతో కాళేశ్వరంను ఆగం చేసే పరిస్థితి ఉందని కోర్టు తీర్చుతో న్యాయపరమైన వివరాలను దుష్టిలో ఉంచుకుని కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచే ప్రయత్నం చేసిందని తేట తెల్లమైందన్నారు. ఇప్పటికైనా రైతులపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే కాళేశ్వరంను రిపేరు చేయించి నీరు ఇవ్వాలని లేని పక్షంలో లక్షల ఎకరాల్లో రైతులను సమీకరించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎంతకైనా తెగించి పోరాడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, మాజీ ఎంపీపీ నెమ్మది భిక్షం, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, నాయకులు బండారు రాజా, బొమ్మగాని శ్రీనివాస్, తూడి నరసింహారావు, బెల్లంకొండ యాదగిరి, కోడి సైదులు, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, అమరవాది శ్రావణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

