శ్రీ వల్లి టౌన్ షిప్ ప్లాట్లకు మరోసారి వేలం
రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో మిగిలిన ఓపెన్ ప్లాట్లు పాక్షిక గృహ నిర్మాణాల వేలం మరోసారి వేయనున్నట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు.
- ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహణ
- ప్రీ బిడ్ సమావేశంలో కలెక్టర్ వినయ్‌క్రిష్ణారెడ్డి
నల్లగొండ, ఫిబ్రవరి 28: రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో మిగిలిన ఓపెన్ ప్లాట్లు పాక్షిక గృహ నిర్మాణాల వేలం మరోసారి వేయనున్నట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో మంగళవారం ఔత్సాహికులతో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు ఈ ప్లాట్ల వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. టౌన్ షిప్లో ఓపెన్ ప్లాట్లు, సెమీ ఫినిష్డ్ గృహాలు అనువైన ధరల్లో ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే మరోసారి ఈ నెల 10న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఓపెన్ ప్లాట్లకు చదరపు గజానికి కనిష్ట ధర రూ.6వేలు నిర్ణయించగా పాక్షిక గృహాలకు గజానికి రూ. 10,500 నిర్ణయించినట్లు వివరించారు రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీటి సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.2.70 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. భౌతిక వేలంలో పాల్గొనే వారు కలెక్టర్ పేరు మీద రూ.10వేల డీడీ చెల్లించాలన్నారు. అదనపు వివరాల కోసం 91543 39209 నంబర్ సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ సమావేవంలో అదనపు కలెక్టర్లు ఖుష్బూ గుప్తా, భాస్కర్ రావు, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

