చివరి గింజనూ ప్రభుత్వం కొనాలి!
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నార్కట్‌పల్లి మం డలం షాపల్లి, నెమ్మాని గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతుల సమస్యలు తెలుసుకున్నారు.
- కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20 రోజులు దాటినా కాంటా పెట్టడం లేదు
- నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నార్కట్‌పల్లి మే 13 : కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నార్కట్‌పల్లి మం డలం షాపల్లి, నెమ్మాని గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతులను కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ సర్కారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
కేసీఆర్ వ్యవసాయాన్ని పండగలా మారిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దండగలా మార్చిందన్నారు. పండించిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.లారీలు సరైన సమయానికి రాక రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు.
లారీలు ఉన్నచోట సంచులు ఉండవని, సంచులు ఉన్నచోట లారీలు ఉండవని మండిపడ్డారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి సకాలంలో కాంటాలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, మేకల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

