24న సూర్యాపేటకు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రానికి రానున్నారు. సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటెగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను ప్రారంభించనున్నారు.
- సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవాలకు హాజరు
- ప్రభుత్వ మెడికల్ కళాశాల,ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను అందుబాటులోకి తేనున్న ముఖ్యమంత్రి
- అనంతరం భారీ బహిరంగ సభ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రానికి రానున్నారు. సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటెగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయా నిర్మాణాలు పూర్తి కాగా.. గ్రీనరీ, సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. మెడికల్ కళాశాల భవనం, ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్ సూర్యాపేట జిల్లా కేంద్రానికే ఐకాన్‌గా నిలువనున్నాయి. ప్రారంభోత్సవాల అనంతరం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు.
– సూర్యాపేట, జూలై 7 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, జూలై 7 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న సూర్యాపేట పర్యటనకు రానున్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని, జిల్లా పోలీస్ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.
సూర్యాపేటకే ఐకాన్ మెడికల్ కళాశాల..
ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ సూర్యాపేటకు రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు చేయగా నేడు అది పట్టణానికి ఐకాన్‌లా మారింది. 2019లో సూర్యాపేట, నల్లగొండకు మెడికల్ కళాశాలలు మంజూరు కాగా 150 సీట్ల చొప్పున ఈ ఏడాది తొలి బ్యాచ్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని బయటకు రాబోతోంది. వైద్య విద్యార్థులతో పాటు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డాక్టర్లు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సిబ్బందితో మెడికల్ క ళాశాల, జనరల్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 3 వేలకు పైగా కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నది.
నిర్మాణం పూర్తయిన సమీకృత కలెక్టరేట్..
జిల్లా కేంద్రంలోని కుడకుడ సమీపంలో నిర్మితమవుతున్న సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం 99 శాతం పూర్తయింది. భవనానికి తుది మెరుగులు దిద్దుతుండగా మొక్కలతో గ్రీనరీ కూడా జరుగుతుంది. ఈ నెల 24 నాటికి వందశాతం పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధం కానున్నది. మొత్తం రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్లతో పాటు అన్ని శాఖల చాంబర్లు ఇతరత్ర కోసం 1.25 లక్షల ఎస్ఎఫ్టీలలో నిర్మించారు. కాగా 20 ఎకరాల స్థలంలో రూ.25 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మితమైన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. నాలుగు అంతస్తుల్లో 56 వేల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో నిర్మాణం కాగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ సిద్ధం అవుతుంది. మెడికల్ కళాశాల, కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాలతో పాటు సూర్యాపేట నడిబొడ్డున పాత వ్యవసాయ మార్కెట్లో సుమారు రూ.40 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
Mrunal Thakur | కథలు నచ్చక..కాస్త విరామం..! మృణాల్ ఠాకూర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

