‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
స్వర్ణ భారతి ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, లయన్స్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్...
– కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
– కోదాడ కిట్స్ కళాశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
కోదాడ, అక్టోబర్ 16 : స్వర్ణ భారతి ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, లయన్స్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్, స్వర్ణ భారతి ట్రస్ట్ అధ్యక్షుడు నీలా సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నేటి నుండి మూడు రోజుల పాటు ఈ శిబిరం నిర్వహిస్తారని, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని, ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.
హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా నైపుణ్యం కలిగిన వైద్యులచే రూ.10 వేల విలువ చేసే టెస్టులు కూడా ఇక్కడ ఉచితంగా చేస్తున్నందున క్యాన్సర్ పట్ల భయం వీడి స్క్రీనింగ్ చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. అలాగే కంటి చూపు సరిగ్గా లేని వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలకు ఉపయోగపడే విధంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వర్ణ భారతి ట్రస్ట్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ నీలా సత్యనారాయణ, స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ, రాజశేఖర్, వెంపటి వెంకటరమణ, పైడిమర్రి సత్య బాబు, యధా సుధాకర్, వంగవీటి రంగారావు, స్వామి శ్రీనివాస్, స్వామి పుల్లయ్య, ఇమ్మడి చక్రి, రవీందర్, బొగ్గారపు రామ్మూర్తి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

