పెద్దవూర, ఏప్రిల్ 22 : ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. పెద్దవూర మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. సభలో కేసీఆర్ మాట్లాడే స్పీచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ కోల్పోయింని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో అభాసుపాలైందని తెలిపారు. కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయిన ప్రజలు ఇప్పుడు గోసపడుతున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని తెలిపారు.
రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వమే రక్ష అని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, గోనె విష్ణువర్ధన్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు జటావత్ రవినాయక్, మాజీ ఎంపీపీ సుందర్‌రెడ్డి, రమావత్ రవినాయక్, మెండె సైదులు, నడ్డి లింగయ్య, పొదిల శ్రీను, కొట్టె బాలయ్య, నడ్డి బాలరాజుయాదవ్, కిషన్‌నాయక్, రవినాయక్, శ్రీకర్‌నాయక్ పాల్గొన్నారు.