బీఆర్ఎస్ పాలనలోనే ప్రతి గడపకూ సంక్షేమం
సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాష్ట్ర ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
- మరింత అభివృద్ధికి మరోసారి అవకాశం ఇవ్వండి
- కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ రాకుండా చేయాలి
- ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాష్ట్ర ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు ప్రజలు అండగా ఉన్నారని, విపక్షాలు చెప్పే మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. పైళ్ల శేఖర్‌రెడ్డికి పలు గ్రామాల ప్రజలు నీరాజనాలు పలికారు.
భువనగిరి, నవంబర్ 15 : సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ గెలుపుకు బాటలు వేస్తాయని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అనాజిపురం, రెడ్డినాయక్‌తండా, పచ్చర్లబోడుతండా, సూరేపల్లి, ఆకుతోటబాయితండా, బొల్లేపల్లి, సిరివేణికుంట, పెంచికల్‌పహాడ్, రామచంద్రాపురం, బండసోమారం, తుకాపురం, గౌస్‌నగర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లాయన్నారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. భువనగిరి నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ప్రతి ఒకరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపడతానని తెలిపారు. రానున్న రోజుల్లో భువనగిరి నియోజకవర్గాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, మారెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్‌రెడి,్డ పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్, ఎడ్ల సత్తిరెడ్డి, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, జక రాఘవేందర్‌రెడ్డి, కేశవపట్నం రమేశ్, గోదా శ్రీనివాస్‌గౌడ్, సందెల సుధాకర్, పుట్ట వీరేశ్‌యాదవ్, ర్యాకల శ్రీనివాస్, భాసర్నాయక్, సిలువేరు యేసు, సత్యనారాయణ, నాగేంద్రబాబు, ప్రవీణ్‌గౌడ్, సిలువేరు మధు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

