ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఆదివారం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఊరూరా గ్రామ దేవతలకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల నృత్యాలతో వేడుకలు సంబురంగా సాగాయి. సూర్యాపేట తాళ్లగడ్డలో జరిగిన బోనాల వేడుకలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.