ఆపదలో పేదింటి బిడ్డ
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన యువకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది. దాంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దాంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. రాజాపేట మండల కేంద్రానికి చెందిన దొంతి మహేశ్(21)కు తండ్రి లేడు.
- బ్రెయిన్లో బ్లడ్ క్లాట్
- అపస్మారక స్థితిలో మహేశ్
- ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
- వైద్యం చేయించేందుకు ఆర్థిక సాయం కోసం
- వృద్ధాప్యంలో ఉన్న తల్లి వేడుకోలు
రాజాపేట, మే 30 : రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన యువకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది. దాంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దాంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. రాజాపేట మండల కేంద్రానికి చెందిన దొంతి మహేశ్(21)కు తండ్రి లేడు. తల్లి వృద్ధురాలు. మహేశ్ పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. ఉండేందుకు ఇల్లు కూడా సరిగా లేదు. చిన్న పెంకుటింట్లో నివాసం ఉంటున్నాడు. ఉన్న ఊరిలోనే డీజే సౌండ్ సిస్టమ్‌లో పనిచేస్తూ వృద్ధురాలైన తల్లితో కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా, నాలుగు రోజుల క్రితం ఉదయం లేచి రోజులాగే పనికి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
చుట్టు పక్కల వారి సహకారంతో వృద్ధురాలైన తల్లి తన కొడుకును చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లింది. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్వీఎం దవాఖానకు తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేసిన అనంతరం బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిందని, వైద్య కోసం రూ.5 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబమే గడవడం కష్టంగా ఉండగా, వైద్యం కోసం ఇంత డబ్బు ఎక్కడ తేవాలని ఆ వృద్ధ తల్లి తల్లడిల్లిపోతున్నది. ఆ తల్లి ప్రతి ఒక్కరి కాళ్లపై పడి ప్రాధేయపడుతున్న తీరు వర్ణణాతీతం. పేద కుటుంబానికి చెందిన యువకుడు మహేశ్‌కు వైద్య పరీక్షల కోసం చేయూత ఇవ్వాలని గ్రామస్తులు సైతం కోరుతున్నారు. పేదోడి వైద్యం కోసం తమకు తోచినంత సాయాన్ని గూగుల్ పే, ఫోన్ పే ద్వారా 9133109593 నంబర్‌కు పంపించి తన కొడుకును కాపాడాలని ఆ వృద్ధ తల్లి లచ్చవ్వ వేడుకుంటున్నది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

