భువనగిరి ఎమ్మెల్యేకు నిరసన సెగ
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డికి సర్పంచ్ల నుంచి నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ సర్పంచ్ గ్రామాలకే నిధులు ఇస్తూ.. త మకు మొండి చెయ్యి చూపిస్తున్నారంటూ భువనగిరి, వలిగొండ మండలాల బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఆందోళన చేశారు.
- కాంగ్రెస్ సర్పంచ్‌లకే నిధులు ఇస్తున్నారంటూ నిలదీత
- తమకెందుకు ఇస్తలేరంటూ బీఆర్ఎస్ సర్పంచ్ల ఆందోళన
- రసాభాసగా ప్రజాపాలన- 99 రోజుల ప్రగతి ప్రణాళిక
యాదాద్రి భువనగిరి, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డికి సర్పంచ్ల నుంచి నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ సర్పంచ్ గ్రామాలకే నిధులు ఇస్తూ.. త మకు మొండి చెయ్యి చూపిస్తున్నారంటూ భువనగిరి, వలిగొండ మండలాల బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఆందోళన చేశారు. గురువారం భువనగిరి పట్టణ పరిధిలో ప్రజాపాలన- 99రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతుండగా సర్పంచ్‌లు అడ్డుకునే య త్నం చేశారు. వేదిక వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. మహిళా భవనాలు, సీసీ రోడ్ల మంజూరులో చిన్నచూపు చూస్తున్నారని ఫైర్ అయ్యా రు. బీఆర్ఎస్ సర్పంచ్‌లపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే, సర్పంచ్‌లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. ఎమ్మెల్యే అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.
ఉద్యమకారుల హామీల అమలుకు కమిటీ
- మంత్రి పొన్నంతో ప్రత్యేక సమావేశం
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు కమిటీ ఏర్పాటుపై మంత్రి పొన్నం ప్రభా కర్తో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సమావేశమయ్యారు. గురువారం పొన్నం ప్రభాకర్ నివాసంలో భేటీ అయిన వారు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల హామీల అమలు, అర్హుల ఎంపిక అంశాలను మంత్రికి వివరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

