పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. నార్కట్‌పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
- కలెక్టర్ సి. నారాయణరెడ్డి
నార్కట్‌పల్లి, జూలై 23 : ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. నార్కట్‌పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి సిబ్బంది హాజరు రిజిస్టర్‌తోపాటు పలు వార్డులు, వ్యాక్సినేషన్ గది, ల్యాబ్‌ను పరిశీలించారు. రోజూ ఎన్ని టెస్టులు చేసి టీ-డయాగ్నోస్టిక్ సెంటర్‌కు ఎన్ని పంపిస్తున్నారని, అవుట్ పేషెంట్లు ఎందమంది వస్తున్నారని డాక్టర్ ఆదిత్యను అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత పక్కనే ఉన్న యునాని ఆస్పత్రిని కలెక్టర్ తనిఖీ చేసి ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పడకలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆ తర్వాత స్థానిక ఎస్బీఐలోకి కలెక్టర్ వెళ్లారు. ఇప్పటి వరకు రుణమాఫీ పొందిన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్బీఐ నుంచి 484 మందికి రూ. లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయని బ్యాంక్ మేనేజర్ కలెక్టర్‌కు తెలిపారు. బ్యాంకుకు వచ్చిన రైతులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. తనకు రుణమాఫీ డబ్బులు 24 వేలు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయని నార్కట్‌పల్లికి చెందిన రైతు యాదిరెడ్డి కలెక్టర్‌కు తెలిపారు.
2008కి సంబంధించి తీసుకున్న రుణాలు మాఫీ కాలేదని కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం నార్కట్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణ వెల్లెంలలోని ఉన్నత పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. వన మహోత్సవం కార్యక్రమంలో పాఠశాలలో మొక్కలు నాటారు. పాఠశాలలో చేపట్టిన తరగతి గదులు, టాయిలెట్ల మరమ్మతులు, ఇతర నిర్మాణాలు త్వరగా పూర్తిగా చేయాలని, అందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తామని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి 10వ తరగతి విద్యార్థులతో సోషల్ స్టడీస్ డిజిటల్ తరగతుల బోధనను పరిశీలించారు. సంఘటిత, అసంఘటిత రంగాలు, తదితర అంశాలను ప్రశ్న, జవాబు ద్వారా చెప్పారు. ఆయన వెంట మండల ప్రత్యేక అధికారి, డీర్డీఓ నాగిరెడ్డి, డీఈఓ భిక్షపతి, పంచాయతీరాజ్ ఈఈ భూమన్న, డీఈ మహేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

