Nandhikonda : సాగర్ డ్యామ్‌కు కొనసాగుతున్న వార్షిక మరమ్మతులు
నాగార్జునసాగర్ డ్యామ్‌కు ప్రతి ఏటా చేపట్టవలసిన మరమ్మతుల పనులను డ్యామ్ ఎన్ఎస్పీ సిబ్బంది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డ్యామ్ క్రస్ట్ గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు లాంటి పనులను పూర్తి చేయగా, డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను ట్రయల్ రన్ నిర్వహిస్తు గేట్ల రోప్‌లకు గ్రీసింగ్ పనులను చేపడుతున్నారు.
నందికొండ, జూన్ 13 : నాగార్జునసాగర్ డ్యామ్‌కు ప్రతి ఏటా చేపట్టవలసిన మరమ్మతుల పనులను డ్యామ్ ఎన్ఎస్పీ సిబ్బంది ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డ్యామ్ క్రస్ట్ గేట్లకు ఆయిలింగ్, గ్రీజింగ్, సీళ్లు లాంటి పనులను పూర్తి చేయగా, డ్యామ్ 26 క్రస్ట్ గేట్లను ట్రయల్ రన్ నిర్వహిస్తు గేట్ల రోప్‌లకు గ్రీసింగ్ పనులను చేపడుతున్నారు. మరో వారం రోజుల్లో డ్యామ్ క్రస్ట్ గేట్ల మరమ్మతుల పనులు పూర్తి కానున్నట్లు సిబ్బంది తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడం, శ్రీశైలం ఎగువన ఉన్న రిజర్వాయర్లలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ డ్యామ్‌లోకి నీరు వచ్చి చేరే అవకాశం ఉండడంతో పనులను త్వరతగతిన పూర్తి చేస్తున్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్ ఇన్చార్జి ఎస్ఈ మల్లికార్జునరావు మాట్లాడుతూ.. డ్యామ్ 26 క్రస్ట్ గేట్ల వార్షిక మరమ్మతుల పనులను మరో వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. డ్యామ్ గ్యాలరీలో క్లీనింగ్, లైటింగ్ పనులను చేపడుతున్నట్లు వెల్లడించారు. డ్యామ్ స్పీల్వే పనులకు సంబంధించి ప్రతిపాదనలను పంపించినట్లు చెప్పారు. స్పీల్వే పనులను చేయడానికి జులై నెల చివరి వారం వరకు అవకాశం ఉందన్నారు. డ్యామ్ పటిష్టంగా ఉందని, రానున్న వరదలకు డ్యామ్‌ను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

