పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని పురాతన శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి ఆలయ గోపురాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెకిలించి ధ్వంసం చేయడం కలకలం రేపింది. గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని చోరీ చేసేందుకు యత్నించినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు.
– పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న వేళ ఘటన
కట్టంగూర్, అక్టోబర్ 09 : కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని పురాతన శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి ఆలయ గోపురాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెకిలించి ధ్వంసం చేయడం కలకలం రేపింది. గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని చోరీ చేసేందుకు యత్నించినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఘటనను గుర్తించిన గ్రామస్థులు సుదర్శన చక్రాన్ని భద్రపరిచారు. గోపురాన్ని ధ్వంసం చేయడం వెనుక నిధుల అన్వేషణ ఉందా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇప్పటికే దేవదాయ శాఖ పరిధిలో నమోదైంది. అయితే గత కొంతకాలంగా ఆలయంలో నిత్య దీపధూప నైవేద్యాలు జరగడం లేదు. ఆలయానికి పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామస్థులు పునర్నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా దేవదాయ శాఖకు డిపాజిట్ సైతం చెల్లించారు. టెండర్ ప్రక్రియ ప్రారంభమైతే ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి తరుణంలో గోపురం ధ్వంసం కావడం గ్రామస్థులను ఆవేదనకు గురిచేస్తోంది. పురాతన ఆలయాల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆలయ గోపురాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించేందుకు సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేవదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవడంతోపాటు, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

