నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం

నల్లగొండ : నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. బరిలో మొత్తం 41 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మధ్యే పోటీ నెలకొంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి జానారెడ్డిపై నోముల నర్సింహయ్య 7,700 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. గుర్రంపోడు, తిరుమలగిరిసాగర్, పెద్దవూర, నిడమనూరు, మాడ్గులపల్లి, త్రిపురారం, అనుముల.
మొత్తం 2,19,745 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,10,838 మంది మహిళా ఓటర్లు. ఏర్పాటు చేసిన 346 పోలింగ్ కేంద్రాల్లో 108 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. పోలింగ్ సజావుగా కొనసాగేందుకు 5 వేల మంది పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందికి విధులు కేటాయించారు. పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నారు.
దివ్యాంగులకు, వృద్ధులకు, కొవిడ్-19 రోగులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 8 వేల పోస్టల్ బ్యాలెట్లను జారీ చేశారు. కొవిడ్ రోగులు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

