Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
Murder | ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే సాయికుమార్ వారం క్రితం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో సాయికుమార్ ఈ నెల 18న అర్ధరాత్రి దాటాక విజయవాడ పటమటలో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న పాన్ షాపులోని ఫ్రిజ్ నుంచి రూ.20 వాటర్ బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించాడు.
Murder | బంగారం, డబ్బులు, ఆస్తుల కోసం హత్య చేసిన ఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి.. కానీ కొందరు వ్యక్తులు కేవలం ఒక వాటిల్ బాటిల్ కోసం మనిషిని హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే నల్గొండకు చెందిన మాస సాయికుమార్ (33)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. సాయికుమార్ వారం క్రితం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో సాయికుమార్ ఈ నెల 18న అర్ధరాత్రి దాటాక విజయవాడ పటమటలో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న పాన్ షాపులోని ఫ్రిజ్ నుంచి రూ.20 వాటర్ బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించాడు.
అది గమనించిన పాలు సరఫరా చేసే వాహనం డ్రైవర్ సాయికుమార్‌ను పట్టుకొని పాన్ షాపులో పనిచేసే రవిశంకర్‌కు అప్పగించి వెళ్లిపోయాడు. రవిశంకర్‌తోపాటు బార్లో పనిచేసే అయ్యప్పశంకర్ సాయికుమార్‌ను పిడిగుద్దులు గుద్ది, విచక్షణారహితంగా కొట్టి, నేలపై ఈడ్చుకుంటూ దుకాణానికి వెనుక ఉన్న సందులోకి తీసుకెళ్లారు. అటుగా వెళ్తున్న పోతంశెట్టి నవీన్, సాయిప్రణీత్ కూడా వీరికి తోడయ్యారు. నలుగురూ కలిసి సాయికుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు.
భార్యాపిల్లలున్నారని.. తనను విడిచిపెట్టాలని సాయికుమార్ వేడుకున్నా నలుగురు వ్యక్తులు కనికరించకుండా అతని చేతులను వెనక్కి విరిచి విద్యుత్తు స్తంభానికి కట్టేసి, కర్రలతో తీవ్రంగా కొట్టి 2 గంటల పాటు నరకయాతన పెట్టారు. ఈ క్రమంలో తీవ్రగాయాలతో సాయికుమార్ అక్కడే ప్రాణాలుకోల్పోయాడు. దాడి చేసిన నలుగురు వ్యక్తులు పరారయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కే సీసీ కెమెరాల ఆధారంగా సు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Also :
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

