నల్లగొండ కళాభారతికి రూ.93కోట్లు
నల్లగొండ జిల్లా కేంద్రంలో కళాభారతి(టౌన్‌హాల్) నిర్మాణానికి అవసరమైన రూ. 93 కోట్లను విడుదల చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ
- ఈ నెల 2న శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి
- కళాభారతికి రూ.93 కోట్లు
నీలగిరి, అక్టోబర్ 7 : నల్లగొండ జిల్లా కేంద్రంలో కళాభారతి(టౌన్‌హాల్) నిర్మాణానికి అవసరమైన రూ. 93 కోట్లను విడుదల చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2న నల్లగొండ పట్టణ పర్యటనకు వచ్చిన మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి కళాభారతి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పట్టణంలో ఉన్న టౌన్‌హాల్ శిథిలావస్థకు చేరింది. అయితే పోరాటాలతో పాటు కళలకు పుట్టినిల్లుగా ఉన్న నల్లగొండ జిల్లాలో కళాభారతి ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం అత్యాధునిక సదుపాయాలతో కూడిన కళాభారతి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో పాటు నిధులు కూడా విడుదల కావడంతో జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్లో కళాభారతి నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఆధునిక టెక్నాలజీతో, పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఏడాదికాలంలో కళాభారతి నిర్మానం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రణాళికలు రూపొందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

