శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Jan 29, 2020 , 03:49:43

ఫిబ్రవరి 1నుంచి చెర్వుగట్టు జాతర

ఫిబ్రవరి 1నుంచి చెర్వుగట్టు జాతర

ఫిబ్రవరి 1నుంచి 6వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగే శ్వరస్వామి వార్షిక బ్రహ్మో త్సవాల(జాతర)కు వచ్చే భక్తు లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం చెర్వుగట్టు జాతర ఏర్పాట్లను పరిశీ లించి సంబంధిత అధికారు లతో మాట్లాడారు.

  • భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నిసౌకర్యాలు కల్పించాలి
  • ఇన్‌చార్జి కలెక్టర్‌ చంద్రశేఖర్‌
  • చెర్వుగట్టుపై ఏర్పాట్ల పరిశీలన

నార్కట్‌పల్లి : ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నిఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వి చంద్రశేఖర్‌ సూచించారు. మంగళవారం చెర్వుగట్టు గుట్టపై జరుగుతన్న ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. 


గుట్టపై తాగునీరు మరుగుదొడ్లు, భక్తులు సేద తీరేందుకు చలువ పందిళ్లు ఏర్పా టు చేయాలని సూచించారు. అధికారులు, ఆలయ సిబ్బంది సమన్వయంతో పని చేసి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. గుట్లకింద ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ప్రత్యేక పార్కింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్‌, దేవాలయ ఈఓ సులోచన, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌, ఎంపీడీఓ సాంబశివ రావు, దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పం చ్‌ మల్గ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


logo