రామగిరి, జూన్ 7 : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2023 సెప్టెంబర్‌లో నిలిచిపోయిన ప్రక్రియ మళ్లీ షురూ కానుంది. అప్పుడు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు మాత్రమే జరుగాగా.. జీహెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్స్ పదోన్నతులు, బదిలీలు, ఎస్జీటీ బదిలీలు, పండిట్, పీఈటీల అప్గ్రెడేషన్స్ కోర్టు కేసుల నేపథ్యంలో నిలిచిపోయింది. వీటిని తిరిగి కొనసాగించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన శుక్రవారం షెడ్యూల్ విడుదలు చేశారు. దాని ప్రకారంగా ఈ నెల 8 నుంచి ప్రక్రియ మొదలై 30తో ముగియనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,971 మంది ఉపాధ్యాయులుండగా వీరిలో ఆయా ప్రాంతాల్లో ఒకేచోట పనిచేస్తూ లాంగ్ స్టాండ్‌లో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని బదిలీలకు సిద్ధంగా 8వేలకు పైగా ఉన్నారు. బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వ ప్రకటనపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో ఒకే చోట 8 ఏండ్లు పూర్తి చేసిన ఉపాధ్యాయులు ఉన్నవారి వివరాలు, ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్స్ను జనవరిలో విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయులకు ఏప్రాంతంలో ఖాళీలు ఉన్నాయనే విషయం స్పష్టం కావడంతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, లోకల్‌బాడీ విభాగంలో 2,774 ఖాళీలను చూపించారు. వీటిలో క్లియర్ వేకెన్స్లో 110, లాంగ్‌స్టాండింగ్‌లో 73 చూపించారు. లోకల్‌బాడీ విభాగంలో ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్సీలో 1,009, లాంగ్‌స్టాండింగ్‌లో 1,582 మొత్తం 2,591 చూపించగా రెండు విభాగాల్లో కలిపి 2,774 ఖాళీలను ప్రకటించారు. గతేడాది షెడ్యూల్ ప్రకారం ఆయా విభాగాల్లో సీనియారిటీ జాబితాలు, పదోన్నతుల జాబితాలను సైతం సిద్ధం చేశారు.
ఉపాధ్యాయుల బదిలీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గతంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నల్లగొండ జిల్లాలో 4, 416, సూర్యాపేటలో 2,856, యాదాద్రిభువనగిరిలో 2, 260 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటికీ అధికారులు గతంలోనే ఆమోదం తెలిపారు.
ఈ నెల 8నుంచి 9 వరకు ఆర్జేడీ, డీఈఓ కార్యాలయంలో స్కూల్ అసిస్టెంట్ అండ్ సమాన హోదా ఉన్న ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్, మల్టీ జోన్ -1, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు వెల్లడి. ఎస్జీటీ బదిలీల జాబితా విడుదల. ఈ నెల 10, 11న ఆయా పోస్టుల విషయంలో ఉపాధ్యాయుల నుంచి వ్యక్తిగతంగా అభ్యంతరాలు స్వీకరణ. ఈ నెల 12న డీఈఓ కార్యాలయంలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల ఫైనల్ లిస్ట్ వెల్లడి. ఈ నెల 13 నుంచి 16వరకు పదోన్నతులకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం.1న ఎస్జీటీ బదీలకు ఖాళీల వెల్లడి. 18 నుంచి 20 వరకు ఫైనల్ సీనియారిటీ లిస్టు విడుదల, వెబ్ ఆప్షన్స్, ఎడిటింగ్, ఎస్జీటీ సమాన హోదా కేడర్ 21, 22న బదిలీ కాబడిన ఎస్జీటీ టీచర్స్, సమాన హోదా కలిగిన టీచర్స్ ఆర్డర్స్ విడుదల, జడ్పీ అండ్ ప్రభుత్వ మేనేజ్మెంట్ వారీగా మల్టీ జోన్ -1