వాషింగ్టన్ : అమెరికాలో పని చేయటానికి ఉపయోగపడే హెచ్-1బీ వీసాలను ఇప్పుడిస్తున్నదానికంటే రెట్టింపు చేయాలనే డిమాండ్ స్వయంగా అమెరికాలోనే ఊపందుకుంటున్నది. శక్తివంతమైన ఆ దేశ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మేరకు ‘అమెరికా వర్క్స్’ పేరుతో భారీ ఎత్తున ప్రచారాన్ని ఇటీవల ప్రారంభించింది. అమెరికాలో నిపుణుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. హెచ్-1బీ వీసాలను రెట్టింపు చేయాలని, అమెరికా పౌరసత్వానికి చిహ్నమైన గ్రీన్‌కార్డుల జారీలో ప్రస్తుతం దేశాలవారీగా విధిస్తున్న కోటాలను పూర్తిగా తొలగించాలని ఆ సంస్థ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు బైడెన్ యంత్రాంగానికి, కాంగ్రెస్‌కు విజ్ఞాపనలు చేసింది. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న డిమాండ్లు ఇలా ఉన్నాయి..