శుక్రవారం 29 మే 2020
Nagarkurnool - Mar 10, 2020 , 00:30:12

హాజమ్మకు ‘పుడమి మహిళా పురస్కారం’

 హాజమ్మకు ‘పుడమి మహిళా పురస్కారం’

ఊట్కూర్‌ : వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు తనకంటూ గుర్తింపును పొందిన జోగిణీ వ్యవస్థ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ హాజమ్మకు ‘పుడమి మహిళా పురస్కారం 2020’ లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం నల్లగొండలో పుడమి సాహితీ వేదిక అధ్యక్షులు చిలుముల బాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో హాజమ్మను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమెకు మెమెంటో, ప్రశంసా పత్రం అందజేశారు. హాజమ్మకు పుడమి మహిళా పురస్కారం లభించడం పట్ల ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మొట్కార్‌ బాల్‌రెడ్డి, ఊట్కూర్‌ గ్రామ సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి, సామాజిక కార్యకర్త నారాయణ, అంబేద్కర్‌ సంఘం నాయకులు చిన్న తిమ్మప్ప, కొండన్‌ గోపాల్‌, రాజప్ప,సాయిలు హర్షం వ్యక్తం చేశారు.


logo