శనివారం 30 మే 2020
Nagarkurnool - Jan 30, 2020 , 01:21:54

శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌

శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌ సెర్చ్‌

కోడేరు: గ్రామాల్లో  శాంతి భద్రతలు కాపాడటానికే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని నాగర్‌కర్నూల్‌  డీఎస్పీ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.కోడేరులోని వడ్డెర కాలనీలో బుధవారం రాత్రి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ   మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు వస్తే పట్టుకోవడానికి లేదా సమాచారం తెలుసుకోవడానికి ఈ  సెర్చ్‌ దోహద పడుతుందన్నారు.  ఈ  40 మంది పోలీసు సిబ్బంది 5పార్టీలుగా ఏర్పడి తనిఖీ చేసినట్లు వివరించారు. 13 ద్విచక్రవాహనాలకు ఏలాంటి కాగితాలు లేనందున వాటిని సీజ్‌ చేసినట్లు వివరించారు. ఈ  కొల్లాపూర్‌ సీఐ వెంకట్‌రెడ్డి, కోడేరు, పెద్దకొత్తపల్లి, ఎస్‌ఐలు భాగ్యలక్ష్మీరెడ్డి, నాగన్న,  పాల్గొన్నారు. 


 ప్రజల భద్రత కోసమే కార్డన్‌ సెర్చ్‌:డీఎస్పీ

అచ్చంపేట రూరల్‌: ప్రజల భద్రత కోసమే కార్డన్‌ సెర్చ్‌ (తనిఖీలు) నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ నర్సింహులు స్పష్టం చేశారు. బుధవారం రాత్రి పట్టణ సమీపంలోని శివ సాయినగర్‌ కాలనీలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ధ్రువ పత్రాలు సక్రమంగా లేని 7 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీ  చేసుకున్నారు.  కార్యక్రమంలో సీఐ రామకృష్ణ, ఆయా మండలాల ఎస్సై, 60 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


దేశిటిక్యాలలో ..

నాగర్‌కర్నూల్‌ క్రైం:  నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ పరిధిలోని దేశిటిక్యాల గ్రామంలో బుధవారం రాత్రి కార్డన్‌  సెర్చ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సాయిశేఖర్‌ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దేశిటిక్యాలలో తనిఖీ నిర్వహించినట్లు సీఐ గాంధీనాయన్‌ పేర్కొన్నారు.  అనుమానంగా ఉన్నా 12 ద్విచక్ర వాహనాలను, ఒక ఫోర్‌విల్లర్‌ను స్వాధీనం చేసుకున్నారు.  సీఐతోపాటు ఐదుగురు ఎస్‌ఐలు, 50 మంది పోలీసులతో గ్రామంలో సోదాలు నిర్వహించారు. 

రామనగడ్డకాలనీలో..

వెల్దండ:  కేంద్రంలోని రామనగడ్డకాలనీలో బుధవారం రాత్రి   సీఐ నాగరాజు ఆధ్వర్యంలో  పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు అదనపు కేంద్ర బలగాలతో కాలనీలో ఆకస్మాత్తుగా దిగి కాలనీ మొత్తం ఒక్క సారిగా జల్లెడ పట్టారు. ప్రతి ఇంటిలో ఉన్న బైక్‌లను తెప్పించుకొని పత్రాలను పరిశీలించారు.6 బైక్‌లను, 2ఆటోలు సరైన పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని, విచారణ జరిపి అనంతరం చర్యలు తీసుకుంటామని  ఎస్‌ఐ నర్సింహులు తెలిపారు. కార్డన్‌ సెర్చ్‌లో డీఎస్పీతో పాటు ఇద్దరు సీఐలు 5మంది ఎసైలు, 8 మంది కేంద్ర అదనపు బలగాలు, 55 మంది స్థానిక పోలీసులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలోకల్వకుర్తి సీఐ సైదులు, ,  వంగూరు, ఊర్కొండ, కల్వకుర్తి ఎస్‌ఐలు బాలకృష్ణ, కృష్ణయ్య, ఏఎస్‌ఐ సత్తిరెడ్డి,  సిబ్బంది తదితరులు ఉన్నారు.


logo