శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Jan 12, 2020 , 03:11:49

పల్లెల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

పల్లెల అభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయం


వెల్దండ :  గ్రామాలు,పల్లెలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో  సీఎం కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌  బాలాజీసింగ్‌ అన్నారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంపై కల్వకుర్తి నియోజకవర్గ స్తాయి సమీక్ష సమావేశం ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా.. నిజయోకవర్గంలోని వెల్దండ, కల్వకుర్తి, చారకొండ మండలాల్లో జరిగిన పల్లెప్రగతిపై డీపీవో సురేశ్‌మోహన్‌ క్లుప్తంగా వివిరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ హయాంలో సర్పంచ్‌లుగా గెలువడం ఎంతో అదృష్టమన్నారు.

ఉప సర్పంచ్‌లు గ్రామ అబివృద్ధిలో బాగస్వాములు కావాలన్నారు.  గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ఏటా రూ.339 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు.  పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ అన్నారు. ఎస్‌ఎఫ్‌సీ, 14వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలకు ప్రభుత్వం ట్రాక్టర్లను మంజూరు చేస్తుందన్నారు.  జెడ్పీ వైస్‌ చైర్మన్‌  మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ట్రాక్టర్లను సర్పంచ్‌ సక్రమంగా గ్రామాభివృద్ధి వినియోగించుకోవాలన్నారు.అనంతరం  వెల్దండ-10, కల్వకుర్తి -10, చారకొండ-05 చొప్పున్న 25 టాక్టర్లను ఆయా మండలాల జీపీలకు  అందజేశారు.కార్యక్రమంలో ఎంపీపీలు  విజయ, సునిత, ని ర్మల, వైస్‌ ఎంపీపీ గోవర్ధన్‌, జెడ్పీటీసీ విజితారెడ్డి,  రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు భూపతిరెడ్డి, వెల్దండ కో-ఆప్షన్‌ అలీమ్‌, ఉపసర్పంచ్‌ నిరంజన్‌, ఏపీడీ గోవిందురాజులు, ఎంపీవోలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : కోదాడ- జడ్‌చర్ల జాతీయ రహదారి పనులను శనివారం కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌ వంగూర్‌ మండలం శ్రీశైలం చౌరస్తాలో నాగర్‌కర్నూల్‌ ఎంపీ  రాములు పరిశీలించారు. అండస్‌ పాసు పనులను పరిశీలిస్తూ త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని ఎంపీ సూచించారు. అనంతరం సంక్రాంతి సెలవులకు గ్రామాలకు వెళ్తున్న విద్యార్థులతో మాట్లాడారు.


logo