ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Mulugu - Jan 27, 2021 , 02:01:39

సంక్షేమం, అభివృద్ధి.. ప్రగతికి సూచికలు

సంక్షేమం, అభివృద్ధి.. ప్రగతికి సూచికలు

  • కాళేశ్వరం ప్రాజెక్ట్‌ జిల్లాకు గర్వ కారణం
  • మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు
  • గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

జయశంకర్‌ భూపాలపల్లి/ ములుగు, జనవరి 26(నమస్తేతెలంగాణ) : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియం, ములుగు జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన వేడు కల్లో కలెక్టర్‌ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మా ట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించేం దుకు ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లాలో ఉండడం గర్వకారణమన్నారు. మిషన్‌ భగీరథ 100 శాతం పూర్తయిందని, 410 ఆవాసాల ద్వారా 1,6712  ఇళ్లకు శుద్ధ జలాలు అందిస్తున్నట్లు వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 19లక్షల 37 వేల పని దినాల ను కల్పించడం వల్ల రూ.50.29 కోట్ల కూలీ డబ్బులు చెల్లిం చినట్లు తెలిపారు. 3,730 స్వయం సహాయక మహిళా  సం ఘాలకు రూ.123 కోట్లు, పట్టణ ప్రాంతంలో 102 గ్రూపులకు రూ. 3కోట్ల 61 లక్షల బ్యాంకు లింకేజీ రుణం, స్త్రీనిధి ద్వారా 687 సంఘాలకు రూ.8 కోట్ల 85 లక్షల రుణాలు అందజేసిట్లు పేర్కొన్నారు. జిల్లాకు 3,898 డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరు కాగా 2,503 ఇండ్లను చేపట్టి 809 పూర్తి చేయగా 1694 పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. అలాగే ములుగు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన 45 ప్రభుత్వ శాఖల ప్ర గతి వివరాలను కలెక్టర్‌ తన ప్రసంగం ద్వారా వినిపించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సీతక్క, ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి, భూపాలప ల్లి జేసీ కూరాకుల స్వర్ణలత, అదనపు ఎస్పీ శ్రీనివాసులు, డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ములుగు జిల్లా స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన  ఏఎస్పీ సాయిచైతన్య, డీఆర్వో రమాదేవి, డీఈవో వాసంతి, డీఆర్‌డీఏ పీడీ పారిజాతం, డీడబ్ల్యూవో ప్రేమలత, కలెక్టరేట్‌ ఏవో శ్యాంకుమార్‌, డీఏవో కేఏ గౌస్‌హైదర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య, డీఎస్‌వో అరవిందరెడ్డి, తహసీల్దార్లు సత్యనారాయణస్వామి, ముల్కనూరి శ్రీనివాస్‌, సీఐ శివప్రసాద్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై అబ్దుల్హ్రమాన్‌, డీపీఎం పద్మప్రియ, ఎఫ్‌డీవో నిఖిత, జూనియర్‌ అసిస్టెంట్‌ భవిత, ఏఎన్‌ఎం వెంకటరమణతో పాటు ఉత్తమ అధికారులుగా ఎంపికైన వివిధ శాఖలకు చెందిన 158మందికి కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. 


VIDEOS

logo