గురువారం 04 జూన్ 2020
Mulugu - Feb 22, 2020 , 03:24:22

ఓం నమశివాయ

ఓం నమశివాయ

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌:శివశివ శంకర.. భక్తవ శంకర.. శంభోశివ శంభో.. అంటూ భక్తులు కొలిచారు.  మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. శివుడికి ప్రీతికరమైన పర్వదినం కావడంతో శుక్రవారం శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. వరంగల్‌లోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం,  కాశీవిశ్వేశ్వరాలయం, శంభునిగుడి, మడికొండలోని మెట్టురామలింగేశ్వరాలయాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని రామప్ప రామలింగేశ్వర, పాలకుర్తి సోమేశ్వర, కురవిలోని వీరభద్రుడి, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయం, కోటగుళ్లలో భక్తులు పరమశివుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.       


logo