మహేష్‌ను కాపీ కొట్టేసిన శర్వానంద్

హీరో శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ వరసగా విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య వరస ఫ్లాపుల్లో ఉన్న శర్వా.. రాబోయే సినిమాలతో విజయం అందుకోవాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన ‘మహా సముద్రం’, ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘శ్రీకారం’ సినిమా మార్చి 11న శివరాత్రి కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడైనా కూడా ఒక సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైనపుడు దాని ముందు వెనక ఆరా తీయడానికి చాలా మంది వేచి చూస్తుంటారు. ఇప్పుడు శర్వా సినిమాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది.
తాజాగా ఈయన నటిస్తున్న ‘మహా సముద్రం’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. మాస్ అప్పీల్ తో ఉన్న ఈ పోస్టర్ చూసి ఫిదా అవుతున్నారు శర్వానంద్ ఫ్యాన్స్. బహుశా ఈయన కెరీర్ లో ఇంత మాసీగా కనిపించడం ఇదే తొలిసారి అవ్వొచ్చు. అంతగా ఈ సినిమా కోసం మేకోవర్ అయిపోయాడు శర్వానంద్. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సిద్ధార్థ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్టర్ చూసి ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అదేంటబ్బా అనుకుంటున్నారా..?
‘మహా సముద్రం’ పోస్టర్ చూస్తుంటే అచ్చంగా ఆరేళ్ళ కింద మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా పోస్టర్ గుర్తుకొస్తుంది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డులు తిరగరాసింది. అందులో ఓ రాడ్ చేతిలో పట్టుకుని మాసీగా కనిపించాడు మహేష్. ఇప్పుడు మహా సముద్రంలో శర్వానంద్ స్టిల్ కూడా సేమ్ టూ సేమ్ అలాగే ఉంది. దాంతో ఈ పోస్టర్ చూడగానే వద్దన్నా మహేష్ బాబు గుర్తుకొస్తున్నాడు. అందుకే బర్త్ డే బాయ్ శర్వానంద్ తమ హీరో స్టైల్ ఫాలో అవుతున్నాడంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కానుంది.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

