న్యూయార్క్ : అమెరికన్ రాక్ స్టార్, ప్రముఖ సింగర్ మీట్ లోఫ్ (74) మరణించారు. బ్యాట్ అవుట్ ఆఫ్ హెల్ ఆల్బంతో మీట్ లోఫ్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. మీట్ ఆరు దశాబ్ధాల కెరీర్లో ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ ఆల్బంలు అమ్ముడయ్యాయి. బ్యాట్ ఆఫ్ హెల్ అల్బంలోని టైటిల్ ట్రాక్‌తో పాటు అదే ఆల్బం నుంచి పారడైజ్ బై ది డ్యాష్‌బోర్డ్ లైట్, ఐ డూ ఎనీథింగ్ ఫర్ లవ్ వంటి ఎన్నో హిట్స్ శ్రోతలను అలరించాయి.
ఫైట్ క్లబ్, ఫోకస్, రాకీ హారర్ పిక్చర్ షో, వేన్స్ వరల్డ్ సహా ఆయన 65కి పైగా సినిమాల్లో నటించారు. మీట్ ఫేస్బుక్ పేజ్‌లో “అతని హృదయం నుండి మీ ఆత్మల వరకు … ఎప్పుడూ రాకింగ్ ఆపకండి! అని స్టేట్మెంట్ పోస్ట్ చేశారు. మీట్ భార్య డెవొరా, కుమార్తెలు పెర్ల్, అమాండ అతడి పక్కనే ఉండగా లెజెండరీ సింగర్ మీట్ లోఫ్ మరణించాడని తెలిపేందుకు మా గుండెలు బద్దలయ్యాయని ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.