హైదరాబాదీ ‘చిట్టి’గుమ్మ
టాలీవుడ్లో హీరోలతో పోటీపడగల పొడగరి ఎవరైనా ఉన్నారా అంటే.. అనుమానం లేకుండా గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. ఇప్పుడు, అనుష్క అంత ఎత్తు ఉందంటూ అందరి ప్రశంసలూ అందుకుంటున్నది ఫారియా అబ్దుల్లా. ఈ సొగసరి హైదరాబాదీ ‘జాతి రత్నాలు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల అభిమానం చూరగొన్నది. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’ పాటతో యువతను తనవైపు తిప్పుకొన్న ఫారియా గురించి ముచ్చట్లు..
- మాది హైదరాబాద్‌లోని బంజారాహిల్స్. పుట్టిందీ పెరిగింది ఇక్కడే. అయినా తెలుగు అంతగా రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నా. ‘జాతి రత్నాలు’ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పుకొన్నా. చిన్నప్పటి నుంచీ కళలంటే ఇష్టం. పెయింటింగ్, సంగీతం, డ్యాన్స్ అన్నీ నేర్చుకున్నాను. నేను మంచి డ్యాన్సర్ కావాలనుకొన్నా. కానీ, నటనవైపు రావడంతో నా కల కలగానే మిగిలిపోయింది. ఏదో ఒకరోజు అది నిజం అవుతుంది.
- మోడలింగ్‌తో నా కెరీర్ మొదలైంది. దాదాపు ఏడేండ్లు థియేటర్ ఆర్టిస్ట్‌గా చేశా. యాభైకి పైగా స్టేజ్ షోల్లో పాల్గొన్నా. అప్పుడే ‘నక్షత్ర’ అనే వెబ్‌సిరీస్‌లో అవకాశం వచ్చింది. అలా, కెమెరా ముందుకొచ్చా.
- లయోలా కాలేజీలో చదువుతున్నప్పుడు ఓ కార్యక్రమానికి దర్శకుడు నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా వచ్చారు. స్టేజీ మీద నేను స్పీచ్ ఇచ్చాను. అప్పుడు ఆయన నన్ను పిలిచి ‘ఏమవ్వాలనుకుంటున్నావు?’ అని అడిగారు. ‘నేను థియేటర్ ఆర్టిస్ట్‌ని. మంచి అవకాశం దొరికితే సినిమాల్లో నటించాలనుకొంటున్నా’ అని చెప్పాను. తర్వాత ఒకరోజు ఆడిషన్‌కి రమ్మని పిలిచారు. అలా ‘జాతి రత్నాలు’ సినిమాలో చాన్స్ వచ్చింది.
- మొదటి సినిమానే పెద్ద నిర్మాణ సంస్థలో చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా మొదలైనప్పుడు తెలుగు రాక కొంత ఇబ్బందిపడ్డా. సెట్లో అందరూ ఓపిగ్గా ప్రతి సన్నివేశాన్నీ అర్థమయ్యేలా వివరించి డైలాగ్స్ చెప్పించేవారు.
- కలివిడిగా ఉండటం, ఫ్రీగా మాట్లాడటం నాకిష్టం. నవీన్, రాహుల్, ప్రియదర్శి కూడా నా టైపే. సెట్లో మా అల్లరి అంతా ఇంతా కాదు. ‘జాతి రత్నాలు’ షూటింగ్ జాయ్‌ఫుల్‌గా జరిగిపోయింది.
- థియేటర్ ఆర్టిస్ట్‌గా చాలా స్టేజ్ షోలు చేసినా సినిమాలో నటించడమే తేలిక అనిపించింది. పెద్దపెద్ద నటుల గురించి, వారి జీవితాల గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం. వాళ్లు ఒడుదొడుకులను అధిగమించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఆ సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతుంటా. నా అభిమాన నటుడు ఫహద్ ఫజిల్. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే ఆయనతో సినిమా చేయాలనుంది.
- ఎన్ని సినిమాలు చేశాం అనేదానికన్నా, ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు కొన్నయినా చేయాలన్నదే నా ఆశయం. నటనలో వేరియేషన్స్ చూపించగలిగితేనే కదా, మంచి నటులు అనిపించుకోగలం. ఎప్పటికైనా ఓ సైకో పాత్ర చేయాలనుంది.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?



