సోమవారం 03 ఆగస్టు 2020
Medchal - Jul 03, 2020 , 02:22:31

హరితహారం కోసం.. జోన్ల వారీగా ప్రణాళిక

హరితహారం కోసం..  జోన్ల వారీగా ప్రణాళిక

65 చోట్ల యాదాద్రి  మోడల్‌ 

పట్టణ అడవులు

భారీగా ఎవెన్యూ ప్లాంటేషన్‌

చెరువు గట్లు, శ్మశానాల్లో 

విరివిగా మొక్కలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆకాంక్షలకు అనుగుణంగా నగరాన్ని హరితనగరంగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్‌ పరిధిలో 2.53 కోట్ల మొక్కలు నాటేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కార్యప్రణాళికను సిద్ధం చేశారు. ఎక్కడెక్కడ.. ఎన్నెన్ని మొక్కలు నాటాలో జోన్లవారీగా ప్రణాళికను రూపొందించారు. 65చోట్ల యాదాద్రి తరహాలో పట్టణ అడవులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, చెరువు గట్లు, శ్మశాన వాటికలు, కాలనీలు, రోడ్ల వెంబడి విరివిగా మొక్కలు నాటాలని నిశ్చయించారు. 

 జీహెచ్‌ఎంసీ హరితహారం కార్యప్రణాళికలో భాగంగా మేజర్‌ రోడ్లు, మైనర్‌ రోడ్లు, మీడియన్లు, కాలనీలు తదితర ప్రాంతాల్లో కోటికిపైగా ఎవెన్యూ ప్లాంటేషన్‌ చేయాలని నిర్ణయించారు. అలాగే, ప్రభుత్వ ఖాళీ జాగలు, వివిధ సంస్థలకు చెందిన ప్రాంగణాలు, శ్మశానవాటికలు తదితర వాటిల్లో 5,10,252 మొక్కలు, చెరువు గట్లు, బఫర్‌జోన్‌, చెరువు వెంబడి ఖాళీ జాగల్లో 12,53,086 మొక్కలు, నాలాలు, మూసీ వెంబడి 21,25,000 మొక్కలు, కాలనీల్లోని పార్కులు, ట్రీ పార్కుల్లోని ఖాళీ స్థలాలు, కొత్త పార్కులు తదితర చోట్ల 3,94,950 మొక్కలు, యాదాద్రి ఫారెస్ట్‌ మోడల్‌లో 17,67,500 మొక్కలు, పార్కులు, ఫ్లైఓవర్లు, మీడియన్‌లలో 68,91,940 మొక్కలు, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల్లో 19,20,948 మొక్కలు కలిపి మొత్తం రెండు కోట్ల 53లక్షల 26వేల 54మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొక్కలు నాటడమే కాకుండా దాతలు, కాలనీ సంఘాల సహకారంతో వాటి పరిరక్షణకు ట్రీగార్డులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొక్కలను సంరక్షించేందుకు వార్డులవారీగా వలంటీర్లను నియమిస్తున్నట్లు అధికారులు వివరించారు. 

యాదాద్రి మోడల్‌ అటవీ పార్కులు ఇలా..

జోన్‌ పార్కులు

ఎల్బీనగర్‌ 8

చార్మినార్‌ 10

ఖైరతాబాద్‌ 10

శేరిలింగంపల్లి 18

కూకట్‌పల్లి 13

సికింద్రాబాద్‌ 6

మొత్తం 65

జోన్లవారీగా రెండున్నర కోట్ల మొక్కలు నాటే ప్రణాళిక ఇలా....

స్థలం ఎల్బీనగర్‌ చార్మినార్‌ ఖైరతాబాద్‌ శేరిలింగంపల్లి కూకట్‌పల్లి సికింద్రాబాద్‌ మొత్తం

ఎవెన్యూ 1931688 1697290 1427035 2121775 1768920 1515670 10462378

ఖాళీ జాగలు 65000 101000 34150 168852 102850 38400 510252

చెరువుల వద్ద 272500 201635 30150 436560 281741 30500 1253086

నాలాల వెంబడి 700000 450000 450000 200000 120000 205000 2125000

కాలనీలు 60192 54455 107120 102378 51160 19465 394950

యాదాద్రి మోడల్‌ 525000 375000 250000 375000 106500 136000 1767500

పార్కులు, ఫ్లైఓవర్లు 2400000 170620 480080 2779240 200000 762000 6891940

ఫారెస్ట్‌ పార్కులు 500000 250000 0 0 1170948 0 1920948

మొత్తం 6454380 3400000 2778535 6183805 3802119 2707215 25326054


logo