గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Feb 09, 2020 , 00:43:25

ప్రణాళికే.. విజయసోపానం

ప్రణాళికే.. విజయసోపానం
  • నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌
  • సికింద్రాబాద్‌ ఎస్వీఐటీ కళాశాలలో జాబ్‌ కనెక్ట్‌ మేళా

మారేడ్‌పల్లి:  ప్రణాళికాబద్ధంగా కష్టపడితేనే, విజయాలు సొంతమవుతా యని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు.  సికింద్రాబాద్‌లోని స్వామి వివేకానంద ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం నార్త్‌ జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌  సారథ్యంలో కార్ఖానా ఇన్‌స్పెక్టర్‌ మధుకర్‌ స్వామి నేతృత్వంలో నిర్వహించిన జాబ్‌ కనెక్ట్‌ మేళాను సీపీ ప్రారంభించి మాట్లాడారు. జాబ్‌ మేళాలో సుమారు 400 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడం ఎంతో సంతోషకరమన్నారు. ఇందులో 20 కంపెనీలకు పైగా పాల్గొన్నాయని తెలిపారు. నగరంలోని జోన్‌ల వారీగా జాబ్‌ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు.  కార్యక్రమంలో  నార్త్‌జోన్‌ అదనపు డీసీపీ శ్రీనివాస్‌, మహంకాళి ఏసీపీ వినోద్‌ కుమార్‌, ఎస్‌ఐ సందీప్‌రెడ్డి, అవినాష్‌బాబు, ఏఎస్‌ఐలు దీప్‌కౌర్‌, సరళ, భాగ్యకిరణ్‌, పోలీసు సిబ్బంది ఫీబా, ప్రీతి, భార్గవి తదితరులు పాల్గొన్నారు. 


logo