గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Feb 05, 2020 , 01:09:28

ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు... ప్రచారం ముమ్మరం

 ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు... ప్రచారం ముమ్మరం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రధా న కార్యదర్శి పదవికి జగన్‌మోహన్‌ రావు, కే.జగదీశ్వర్‌ యాదవ్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది. నువ్వానేనా విధంగా  ప్రచారం ప్రారంభమైంది. కోశాధికారి పదవికి కే.మహేష్‌ సాగర్‌, ఫణిరావు పోటీలో ఉన్నారు. ఉపసంహరణ అనంతరం  ప్రధానకార్యదర్శి, కోశాధికారి పోస్టులకు ఇద్దరు మిగిలి ఉన్నారని ఎన్నికల అధికారి జస్టిస్‌ బీ.చంద్రా కుమార్‌ వెల్లడించారు. 

 జగన్‌మోహన్‌ను గెలిపించాలి

 తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పోటీ చేస్తున్న జగన్‌ మోహన్‌ రావులను తెలంగాణ క్రీడా సంఘాలు పూర్తి మద్ద తు ఇచ్చి గెలిపించాలని తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌, జగన్‌ మోహన్‌ రావు నూతన యువ ప్యానల్‌ అన్ని క్రీడా సంఘాలు బాధ్యతలు తీసుకొని గెలిపించాలని ఆయన ప్రచారాన్ని  ముమ్మరం చేశారు.

ఒలింపిక్‌ స్థాయి వరకు తీసుకెళ్తా

తెలంగాణ క్రీడాకారులను ప్రభుత్వ ప్రైవేట్‌ సహకారంతో ఒలింపిక్‌ స్థాయి వరకు తీసుకెళ్తానని తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పోటీ చేస్తున్న జగన్‌మోహన్‌రావు అన్నా రు. మంగళవారం ఎల్బీ స్టేడియంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ 40 ఏళ్లుగా బ్రష్టు పట్టించిన క్రీడలని, క్రీడాకారులకు అందవలసిన అన్ని సహకారాలను అందజేస్తూ వారిని ముందుకు తీసుకువెళ్లేందుకు  పోటీలో నిలబడ్డానని జగన్‌మోహన్‌రావు స్పష్టం చేశారు.


logo