Electric shock | మెదక్ జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్తో యువకుడి మృతి
ట్రాన్స్ ఫార్మర్ వద్ద మరమ్మత్తులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి షాబాద్ కు చెందిన అనిల్ (26) మరణించాడు.
టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం షాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని దండువానికుంట శివారులో ట్రాన్స్ ఫార్మర్ వద్ద మరమ్మత్తులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి షాబాద్ కు చెందిన అనిల్ (26) మరణించాడు. విద్యుత్తు సరఫరాలో తరచుగా అంతరాయంఏర్పడుతుండటంతో పొలాలకు నీళ్లు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ కు కరెంట్ కనెక్షన్ మార్చుకోవ డానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో వెంటనే కనెక్షన్ మార్చుకుం దామనే ఆలోచనతో నిచ్చెన సహాయంతో ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు పోల్ పైకి ఎక్కాడు. ఆ సమయంలో లైన్ మెన్ సైతం అక్కడే ఉన్నాడు.
అతను నిచ్చెనపై నిల్చోగా అనిల్ విద్యుత్తు కనెక్షన్ ఇస్తున్నాడు. ఇంతలో విద్యుత్తు సరఫరా కావడంతో ప్రమాదవశాత్తున షాక్ తగిలింది. దీంతో అతను కరెంట్ పోల్ పైనే ప్రాణాలను కోల్పోయాడు. లైన్ మెన్ కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే యువకుని ప్రాణాలు పోయాయని మృతుడి బందువులు ఆందోళనకు దిగారు. ఎల్లుపేట సబ్ స్టేషన్ ఆపరేటర్ పై స్థానికులు దాడి చేశారు. అనిల్ మరణంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

