చలికాలంలో వెచ్చని నేస్తాలు.. ఉన్ని దుస్తులు
చలికాలంలో ఉన్ని దుస్తులు వెచ్చని నేస్తాలుగా చలి నుంచి రక్షణనిస్తాయి. రోజురోజుకూ పెరుగుతున్న చలి త్రీవత నుంచి కాపాడుకునేందుకు జిల్లా ప్రజలు స్వెటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్తించి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వాసులు మెదక్ జిల్లా కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా షెడ్లు వేసి ప్రత్యేంగా దుకాణాలు పెట్టారు
- రంగురంగుల ఉలాన్ స్వెటర్లు
- చిన్నారులను ఆకర్షించే బొమ్మలతో
- రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత
- ఊపందుకున్నకొనుగోళ్లు
- నాణ్యత, సైజ్‌ను బట్టి ధరలు
మెదక్ రూరల్, అక్టోబర్ 26: చలికాలంలో ఉన్ని దుస్తులు వెచ్చని నేస్తాలుగా చలి నుంచి రక్షణనిస్తాయి. రోజురోజుకూ పెరుగుతున్న చలి త్రీవత నుంచి కాపాడుకునేందుకు జిల్లా ప్రజలు స్వెటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్తించి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వాసులు మెదక్ జిల్లా కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా షెడ్లు వేసి ప్రత్యేంగా దుకాణాలు పెట్టారు. ఈ దుకాణాల్లో రంగురంగుల ఉలాన్ స్వెటర్లు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. నేపాల్, పంజాబ్, టిబెట్, తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన ఈ స్వెటర్లకు డిమాండ్ పెరుగుతున్నది. నేడు ఉన్ని వస్ర్తాలు కూడా వివిధ రకాల్లో ఆకర్షణీయమైన డిజైన్లలో లభిస్తున్నాయి.
అందుబాటులో అనేక రకాలు
చలితో పాటు వర్షానికి కూడా తట్టుకునేలా టూ ఇన్ వన్ రకాలు అందుబాటులో ఉన్నాయి. స్వెటర్లు, జర్కిన్లు, శాలువాలు, మంకీ టోపీలు ఇలా అనేక రకాలైన ఉన్ని దుస్తులు అందుబాటులో ఉన్నాయి. చిన్నారులను ఆకర్షించేలా పలు చోటాభీమ్, లిటిల్ సింగం, తదితర రకాల జంతువుల బొమ్మలతో కూడిన స్వెటర్లు లభిస్తున్నాయి. మహిళలు, వృద్ధులకు యువతకు అనుకులమైన బటన్, జిప్, బనియన్ టైప్ రకాలు వివిధ రంగుల్లో అమ్మకానికి పెట్టారు. వీటి ధర రూ150 నుంచి 200 వరకు నాణ్యత, సైజ్‌ను బట్టి ధరలు ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
జాగ్రత్తలు పాటిస్తే మన్నిక..
చలికాలంలో ఉన్ని దుస్తులు ఎంతో ఉపకరిస్తాయి. మరి వాటిని ఉతికేటప్పుడు మామూలు దుస్తుల్లా కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో వాషింగ్ మెషన్‌లో వేయకూడదు. ప్రతి రోజు స్వెటర్లను ఉపయోగిస్తుంటారు కాబట్టి ఎక్కువ మురికి వాటిపై పేరుకుపోతుంది. అందుకే ప్రతి రెండు రోజులకోసారి ఉతకడం మేలు. వాటిపై మరకలు పడ్డప్పుడు డ్రైక్లీనింగ్ చేయించుకోవాలి. పెద్ద మరక కాకుంటే చేతితో శుభ్రం చేసుకోవాచ్చు. ఉన్ని వస్ర్తాలను తీగలపై ఆరేయకూడదు. అలా చేస్తే అవి సాగి పోయే అవకాశం ఉంది. ఎక్కువ ఎండ తగలకుండా చూడాలి.
నాణ్యత, సైజ్‌ను బట్టి ధరలు
చలితో పాటు వర్షానికి కూడా తట్టుకునేలా టూ ఇన్ వన్ వంటి రకాలు, చిన్నారులు యువత, మహిళలను ఆకట్టుకునేలా అనేక రంగుల ఉన్ని దుస్తులు అందుబాటులో ఉన్నాయి. నాణ్యత, సైజ్‌ను బట్టి ధరలు ఉంటాయి. వ్యాపారం బట్టి మూడు నెలల పాటు మెదక్ జిల్లా కేంద్రంలో ఉంటాం. ఆ తర్వాత స్వస్థలాలకు వెళ్లిపోతాం.
– మనోజ్, వ్యాపారి, మధ్యప్రదేశ్
తెలంగాణలో మాకు మంచి ఉపాధి
తెలంగాణలో మాకు మంచి ఉపాధి లభిస్తున్నది. ప్రతి సంవత్సరం వ్యాపారం కోసం తెలంగాణకు వస్తాం. ఇక్కడి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టడంతో దేశంలో మార్పు తథ్యం. బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా మార్చారు. తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్న ఆయన బీఆర్ఎస్తో దేశంలోని అన్ని వర్గాల్లోని పేదల ప్రయోజనాల కోసం పని చేస్తారని ఆశిస్తున్నాం. – లక్ష్మణ్, వ్యాపారి, మధ్యప్రదేశ్
అందుబాటులో చాలా వెరైటీలు
మెదక్ పట్టణంలో అన్ని రకాల స్వెటర్లు దొరుకుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ వెళ్లితీసుకునేవాళ్లం. ఇక్కడే అన్ని రకాల దుస్తులు లభించడంతో సమయం, డబ్బులు ఆదా అవుతున్నాయి. మంచి క్వాలిటీ స్వెటర్లు దొరుకుతున్నాయి. తాత్కాలింగా ఏర్పాటుచేసిన ఈ దుకాణాల్లో ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి.
– సంతోష్‌కుమార్, కోనుగోలుదారుడు మెదక్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

