మెదక్ రూరల్/చిన్నశంకరంపేట/తూప్రాన్, అక్టోబర్ 14: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను శనివారం మెదక్ మండలంలోని రాజ్పల్లి, మంబోజిపల్లి, తిమ్మక్కపల్లి, పాతూరు, బాలనగర్ ఆయా గ్రామాల్లో ఘనంగా జరుపుకొన్నారు. తొలి రోజున తీరొక్క రంగు రంగు పూలతో ఎంగిలిపూల బతుకమ్మలను పేర్చి ప్రధా న కూడళ్లలో డీజేలతో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు ఆడారు.
అనంతరం చెరువులో నిమజ్ఙనం చేశారు. కార్యక్రమంలో స్థానికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్లొన్నారు. చిన్నశంకరంపేటతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం మహిళలు బతు కమ్మ పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించారు. తీరొ క్క పూలతో బతుకమ్మలను పేర్చి గ్రామంలోని నడి వీధిలో ఉంచి మహిళలు బతుకమ్మ ఆడారు.
అనంతరం బతుకమ్మ లను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. తూప్రాన్ మండల వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. శనివారం తూప్రాన్ పట్టణంలోని ఐడియల్ స్కూ ల్ విద్యార్థులు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిం చారు. పాఠశాలతో పాటు నర్సాపూర్ చౌరస్తా వద్ద బతుకమ్మ ఆడి, పాడి ఆహుతుల్ని అలరించారు.