భగ్గుమన్న గ్యాస్
గ్యాస్ ధర మళ్లీ మండింది.. ఇప్పటికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్) సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్ ధర శరాఘాతంలా మారనున్నది. తరచూ ధరల పెంపుతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులయ్యే పరిస్థితి దాపురించింది
వంటింట్లో గుది‘బండ’
సామాన్యులపై ధరల కత్తి దూస్తున్న కేంద్రం
వంటింటి గ్యాస్‌పై ఎడాపెడా బాదుడు
రూ.1069కు చేరిన సిలిండర్ ధర
సబ్సిడీకి మంగళం పాడేసిన మోదీ సర్కారు
కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న జనం
గ్యాస్ ధర మళ్లీ మండింది.. ఇప్పటికే భారంగా మారిన గృహ (డొమెస్టిక్) సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. అసలే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న జనానికి గ్యాస్ ధర శరాఘాతంలా మారనున్నది. తరచూ ధరల పెంపుతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులయ్యే పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1002.. తాజా పెంపుతో రూ.1069కు చేరింది. గ్యాస్ బండ ధరను రికార్డు స్థాయిలో పెంచిన కేంద్రం.. సబ్సిడీకి దాదాపు మంగళం పాడేసింది. వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ ధరనూ విపరీతంగా పెంచేశారు. దీంతో నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోయాయి.
మెదక్, (నమస్తే తెలంగాణ) మే 14 : గ్యాస్ వెలిగించకుండానే భగ్గుమంటున్నది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో సామన్య, పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను తరచూ పెంచుతుండటంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క పెట్రో, డీజిల్ ధరలతో అల్లాడిపోతున్న సామాన్య, పేదలపై గ్యాస్ మంటను పెట్టింది. ఇప్పటికే భారంగా మారిన గృహ అవసరాలకు వినియోగించే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.50 పెంచి సామాన్యుల నడ్డి విరిచింది.
మోదీ సర్కారు పాలనలో ..
పేదలకు అచ్చే దిన్ అంటూనే సచ్చే దిన్‌గా మార్చేసింది. పెరిగిన పెట్రో, డీజిల్ ధరలతో అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్లో నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పండ్లు ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు.. అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ మంటతో కనీసం వంట చేసుకుని బుక్కెడు బువ్వా తిందామన్నా.. తినలేని పరిస్థితి నెలకొంది. నేడు పట్టణ, గ్రామీణ అనే తేడా లేకుండా ప్రతి కుటుంబం గ్యాస్‌పైనే ఆధారపడి వంట చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచటంతో ప్రజలు జంకుతున్నారు.

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గ్యాస్ కనెక్షన్లు
నెల నెలా గ్యాస్ ధరలను పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్య, పేద ప్రజలకు వంట గ్యాస్ మరింత భారంగా మారింది. మారుతున్న కాలంతో పాటు పల్లెల్లో సైతం గ్యాస్ స్టవ్ పైనే వంటలు చేయడంతో సిలిండర్ వినియోగం పెరిగింది. సులభతరంగా వంట చేసేందుకు మహిళలు గ్యాస్ స్టవ్‌లనే వినియోగిస్తున్నారు. దీంతో కట్టెల పొయ్యిలపై వంట చేసే అలవాటు మరిచిపోయారు. ప్రతి ఇంట్లో, హోటల్స్‌లో, గ్యాస్ సిలిండర వినియోగం తప్పనిసరిగా మారింది. అంతేగాక ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా గ్యాస్ స్టవ్‌లపైనే వంటలు చేస్తున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ధరల మోత మోగిస్తున్నది. ప్రతి ఇంటా గ్యాస్ స్టవ్ (పొయ్యి) వెలిగించకపోతే రోజు గడవదు. ఒక కుటుంబానికి సగటునా ఏడాదికి 6-12 సిలిండర్లు వినియోగిస్తుంటారు. మెదక్ జిల్లాలో 1.94 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 1,88,178 డొమెస్టిక్ (గృహ అవసరాల), 6402 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. గ్యాస్ సరఫరా చేసేందుకు 16 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. నెలకు 885.63 వందల టన్నుల గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 5,11,015 కనెక్షన్లు ఉండగా, 33 ఏజెన్సీలు ఉన్నాయి.
ప్రజలపై గ్యాస్ ధరల మోత..
గృహ అవసరాలకు (డొమెస్టిక్) వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను ఏకంగా రూ.50 పెంచడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మెదక్ జిల్లాలో ప్రస్తుతం గృహ అవసరాలకు(డొమెస్టిక్) వినియోగిస్తున్న సిలిండర్ ధర రూ. 1069 ఉన్నది. పది నెలల క్రితం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.887 ఉండగా, ఇప్పుడు సిలిండర్ ధర రూ.1069 ఉన్నది. ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.182 ధర పెంచింది. గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో గృహిణులు మండిపడుతున్నారు.
ఇలా ధరలు పెంచితే బతకడం కష్టం
పొయ్యి ముట్టించకపోతే ఇల్లు నడవదు. మాటిమాటికీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి మాలాంటి పేదోళ్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. బీజేపీ సర్కారు పేదలకు వ్యతిరేకంగా ఉన్నది. పెట్రో, డీజిల్‌తో పాటు గ్యాస్ సిలిండర్లు అన్నింటిపై ధరలు పెంచింది. ఒక సిలిండర్ రూ.1069 చెల్లించడం కష్టంగా మారింది. సబ్సిడీ కూడా రావడం లేదు. గ్యాస్ కంటే కట్టెల పొయ్యి బాగుంటుంది. కూరగాయలు, వస్తువుల ధరలు విపరీతంగా పెంచారు. ఇలాగైతే బతకడం కష్టమే.
– పల్లవి, గృహిణి, మెదక్
బీజేపీ సర్కారుతో ఇబ్బందులు
కేంద్ర ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. గతేడాదితో పోల్చితే గ్యాస్ ధర రూ. 182 పైగా పెంచింది. మరో పక్క పెట్రో,డీజిల్ ధరల పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచారు. కూలీ పనులు చేసుకునే బతికే పేదలకు గడ్డు కాలంగా మారింది. సీఎం కేసీఆర్ సారూ..ఆసరా పింఛన్ ఇచ్చి అండగా ఉన్నారు. పింఛన్ రాకపోతే బతకడం కష్టంగా ఉండేది.
– పద్మ,గృహిణి (మెదక్)
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Centre
- Cylinder
- LPG
- price hike
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

