ఏం తీసుకోవాలి…ఎంత తినాలి
పోషకాహారం అంటే ఏమిటీ? ఎందులో ఏ పోషకాలు ఉంటాయి? పోషకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? అంటూ ఆన్లైన్లో వెతకడం, సోషల్ మీడియా రీల్స్ చూడటం టెక్ యుగంలో అలవాటుగా మారింది.
- సరైన పోషకాహారానికి ‘మై ప్లేట్ ఫర్ ద డే’
- సంపూర్ణ ఆరోగ్యానికి ఎన్ఐఎన్ ప్రత్యేక కార్యక్రమం
- రోజూవారీగా తీసుకోవాల్సిన న్యూట్రిషన్ ఫుడ్‌పై అవగాహన
- ఆన్లైన్ సమాచారంతో మోసపోకుండా ప్రచారం
సిటీబ్యూరో, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ) : పోషకాహారం అంటే ఏమిటీ? ఎందులో ఏ పోషకాలు ఉంటాయి? పోషకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? అంటూ ఆన్లైన్లో వెతకడం, సోషల్ మీడియా రీల్స్ చూడటం టెక్ యుగంలో అలవాటుగా మారింది. అయితే ఇంటర్నెట్లో దొరుకుతున్న విస్తృతమైన సమాచారంతో… కొన్ని సార్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అందుకే శాస్త్రీయ విధానంలో పోషకాహారంపై అవగాహన కల్పించేలా జాతీయ పోషకాహార సంస్థ సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే పోషకాహారంపై అవగాహన కల్పిస్తుండగా… తాజాగా మై ప్లేట్ ఫర్ ద డే పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా సులభంగా పోషకాహార ఆవశ్యకత, ఆహారంలోని పోషకాల వివరాలు, ఆరోగ్యాన్ని అందించే ఆహార పదార్థాల వివరాలతో కూడిన జాబితా ప్రకారం రూపొందించి ప్రచారం కల్పిస్తోంది.
సరైన ఆహారానికి సులువైన మార్గం..
విస్తృతంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీ వల్ల పోషకాహారాన్ని ఎంపిక చేసుకోవడం క్లిష్టంగా మారింది. అయితే సరైన ఆహారానికి నిర్దిష్టమైన ప్రమాణాలు లేకపోవడంతో అవసరానికి మించిన కేలరీలు శరీరంలోకి చేరుతున్నాయి. లేదంటే అసలు పోషకాహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించి మెరుగైన ఆరోగ్యాన్నిచ్చే మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా మై ప్లేట్ ఫర్ ద డే పేరిట జాబితా తయారు చేశారు. దీని ప్రకారం నిత్యం శరీరానికి అవసరమైన 2000 కేలరీలను ధాన్యాలు, పప్పులు, పాలు, ఆకుకూరలు, పండ్లు, గింజలతో కలిపి తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా పోషకాలను పొందేందుకు చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటారని, దీని ద్వారా శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి తగ్గిపోవడం, అజీర్తి, డయాబెటిస్ వంటి ఇతర రుగ్మతల బారిన పడుతున్నారని నిపుణులు తేల్చారు. అదేవిధంగా అమైనో ఆమ్లాలు, కొవ్వులు, ఖనిజాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర బయోయాక్టివ్ పదార్ధాల అవసరాన్ని తీర్చేలా సరైన నిష్పత్తిలో ఆహార నమూనాలను సూచించారు. అయితే సమతుల్యమైన ఆహారంలోనే అన్ని పోషకాలు అందుతాయని, దీనికి ప్రత్యేకంగా ఎలాంటి మినరల్ సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రయోజనాలెన్నో..
సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతోపాటు, జీర్ణకోశానికి అవసరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. దీంతో పోషకాల శోషణ మరింత వేగంగా జరుగుతుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుముఖం పడుతుంది. మెదడుకు మంచి పోషకాలు సరఫరా కావడం వల్ల ఏకాగ్రత, మానసిక ఎదుగుదలతోపాటు, శరీరంలో ఇన్సులిన్ అదుపులో ఉంటుంది.
శరీరానికి సరిపడినంత పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత ప్రత్యేక కాన్సెప్ట్‌ను రూపొందించారు. ఆరోగ్యకరమైన పద్ధతులను ప్రోత్సహించడం వల్ల పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు సాయపడుతుందంటారు. ఇటీవల కాలంలో న్యూట్రిషన్ ఫుడ్ కోసం ఆన్లైన్లో వెదకడం, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని బలంగా నమ్మి మోసపోతున్నారు. దీంతో సప్లిమెంట్ల వినియోగం కూడా భారీగా పెరుగుతున్నది. ఇలాంటి వాటిని నియంత్రించే విధంగా ఈ విధానాన్ని డెవలప్ చేసినట్లుగా జాతీయ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పోషకాహారంపై ఉన్న ఎన్నో అపోహాలకు చెక్ పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రోజూ తీసుకునే ఆహారంతోనే మనం ఆరోగ్యం ఉంటాం. కానీ ఏ ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనే లెక్కలపై అవగాహన లేక చాలామంది అయోమయానికి గురవుతుంటారు.తమకు తోచినట్లు తినేవారు కొందరైతే.. ఆన్లైన్లో ఒక్కోరోజు, ఒకలా వచ్చే సమాచారంతో తికమకపడేవారు మరికొందరు. ఒకవేళ వాటినే నమ్మి మితిమీరి తీసుకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశమూ లేకపోలేదు. ఈ క్రమంలో మనిషికి సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేందుకు జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రోజూవారీగా తీసుకోవాల్సిన ఆహారంపై ‘మై ప్లేట్ ఫర్ ద డే’ పేరిట జాబితాను రూపొందించి అవగాహన కల్పిస్తోంది.
జాబితా ప్రకారం..
మై ప్లేట్ ఫర్ ద డే జాబితా ప్రకారం ధాన్యాలు 240 గ్రాములు, కొవ్వులు 27గ్రాములు, గింజలు 30 గ్రాములు, పప్పులు, మాంసం 90 గ్రాములు, కూరగాయలు, ఆకుకూరలు 350 గ్రాములు, పండ్లు 150 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన 2వేల కేలరీలతోపాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతోపాటు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు సమృద్ధిగా సరిపోతాయని, మాంసం తినని వారు ఎక్కువగా పప్పులను తీసుకోవడం వల్ల కండరాల వృద్ధికి అవసరమైన మాంసకృత్తులు అందుతాయని వివరించారు. వీటిని క్రమంగా తీసుకోవడం వల్ల మైక్రో న్యూట్రియంట్ల కొరత కూడా తీరుతుందన్నారు.
పిస్తా పప్పు రోజూ తింటే కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
మొలకెత్తిన పల్లీలు తింటున్నారా?
చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?
కాల్చిన మక్కజొన్న తినాలా.. ఉడికించింది మంచిదా?
హిమోగ్లోబిన్ పెంచే రసాలివే.?
ఖర్జూరం తింటే ఎంత బలం వస్తుంది?
బెండకాయ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?
పాలు రోజుకు ఎన్ని మిల్లీ లీటర్లు తీసుకుంటే మంచిది?
ఇలా ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టే సవాలక్ష మెసేజ్‌లు మిమ్మల్ని
ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. చివరకు ఏది ఎంత, ఎప్పుడు,
ఎంత తినాలో అర్థం కాక తలపట్టుకోవాల్సి వస్తుంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

