Veldurthi Mandal | రోడ్డు నిర్మిస్తేనే ఎన్నికలు పెట్టాలి.. నాలుగు గ్రామాల ప్రజల ఆందోళన
Veldurthi Mandal | మారుమూల గ్రామాల రోడ్లు సైతం బీటీ రోడ్లుగా మారుతూ వెడల్పు అవుతున్నాయి.. కానీ వెల్దుర్తి మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి తమ గ్రామాల మీదుగా ఉన్న ప్రధాన రోడ్డు మాత్రం కనీసం మరమ్మత్తులకు కూడా నోచుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
Veldurthi Mandal | వెల్దుర్తి, నవంబర్ 29 : మండల కేంద్రమైన వెల్దుర్తి నుండి జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణానికి ఉన్న ప్రధాన రోడ్డును నిర్మిస్తేనే తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటామని లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని వెల్దుర్తి మండల పరిధిలోని శెట్టిపల్లి కలాన్, రామాయిపల్లి, బండ పోసానిపల్లి, ఎదులపల్లి గ్రామాల ప్రజలు ఆదివారం శెట్టిపల్లి కలాన్ గ్రామంలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల రోడ్లు సైతం బీటీ రోడ్లుగా మారుతూ వెడల్పు అవుతున్నాయి.. కానీ మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి తమ గ్రామాల మీదుగా ఉన్న ప్రధాన రోడ్డు మాత్రం కనీసం మరమ్మత్తులకు కూడా నోచుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెల్దుర్తి నుండి తమ గ్రామాల మీదుగా మెదక్ వరకు ఉన్న రోడ్డు కంకర తేలి, పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రయాణానికి వీలు లేకుండా ఉందన్నారు. తమ గ్రామాల నుండి చదువుల కోసం వెల్దుర్తి, మెదక్ కు అలాగే వెల్దుర్తి, మెదక్‌ల నుండి తమ గ్రామాలకు వచ్చే ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు సైతం రావడానికి ఇబ్బందులు పడుతున్నారని.. దీంతో తమ గ్రామాలు అభివృద్ధికి అన్ని రకాల దూరంగా ఉంటున్నామన్నారు.
అత్యవసర వైద్య చికిత్సల కోసం మెదక్ వెళ్లాలంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని వాపోయారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రోడ్డు మాత్రం మారడం లేదని ఈ గతుకుల రోడ్డులో పలు ప్రమాదాలు జరిగి ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోగా మరికొందరు గాయాలపాలు అయ్యారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెల్దుర్తి- మెదక్ ప్రధాన రోడ్డును రెండు వరుసల రోడ్డుగా నిర్మించాలని.. అప్పుడే మా గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేకుంటే తామే ఎన్నికలను బహిష్కరిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Also :
Shiva 4K | శివ 4K వెర్షన్‌ను థియేటర్లలో మిస్సయ్యారా..? అయితే ఈ అప్డేట్ మీ కోసమే..!
Wheat | గోధుమలు అంటే కేవలం చపాతీలే కాదు.. ఇలా కూడా తీసుకోవచ్చు.. ఎన్నో లాభాలను అందిస్తాయి..!
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

