మాటు వేసి.. గంజాయి గుట్టు రట్టు చేసి..
గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్‌నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం
- ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు
- 358 కేజీల గంజాయి, కారు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1300 నగదు స్వాధీనం
మన్సూరాబాద్, మే 11: గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్‌నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం, అన్నెగుంట గ్రామం, ఒంటెగడ్డ తండాకు చెందిన శివాజీచౌహాన్ (20) క్యాటరింగ్ పని చేస్తుంటాడు. షాకాపూర్ తండాకు చెందిన అర్జున్‌కు గంజాయి సరఫరా చేసే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరికీ గంజాయి తరలింపులో జహీరాబాద్ మండలం, హోతీ గ్రామం, మడ్ తండాకు చెందిన డ్రైవర్ శివాజీచౌహాన్(43) సహకరిస్తుంటాడు.
ఈ నెల 7న ఒంటెగడ్డ తండాకు చెందిన శివాజీ చౌహాన్, మడ్ తండాకు చెందిన శివాజీచౌహాన్ ఇద్దరూ కలిసి గంజాయిని కొనుగోలుకు కారులో ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, మారేడ్‌మిల్లి ఏజెన్సీకి వెళ్లారు. దారకొండకు చెందిన దొమ్ము వద్ద 358 కేజీల గంజాయిని కొనుగోలు చేసి ముంబైలో విక్రయించేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు ఈ సమాచారం విశ్వసనీయంగా అందడంతో మంగళవారం సాయంత్రం పెద్దఅంబర్‌పేట్ వద్ద మాటు వేసి వారిని పట్టుకున్నారు. వీరి నుంచి 358 కేజీల గంజాయి, కారు, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1300 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను బుధవారం రిమాండ్‌కు తరలించారు. కేసుతో ప్రమేయమున్న అర్జున్, దొమ్ము పరారీలో ఉన్నారు. సమావేశంలో డీసీపీ ఎస్వోటీ రాచకొండ కె.మురళీధర్, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ లక్ష్మి, ఏసీపీ ఎస్వోటీ రాచకొండ డి.వెంకన్న నాయక్, హయత్‌నగర్ పీఎస్ సీఐ హెచ్.వెంకటేశ్వర్లు, ఎస్వోటీ ఎల్బీనగర్ జోన్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి పాల్గొన్నారు.
గుట్కా, తంబాకు పాకెట్లు స్వాధీనం
రామాయంపేట, మే 11: పట్టణంలోని కిరాణా దుకాణంపై విశ్వసనీయ సమాచారం మేరకు టాస్కుఫోర్సు అధికారులు బుధవారం దాడులు జరిపిన రూ.3లక్షల విలువైన గుట్కాలు, తంబాకు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామాయంపేటకు చెందిన ఎనిశెట్టి రాములు కిరాణా దుకాణంపై మెదక్ టాస్క్ ఫోర్సు అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు రూ.3లక్షల విలువైన గుట్కా పాకెట్లు, తంబాకు ఇతర డ్రగ్స్‌కు సంబంధించిన ప్యాకెట్లు లభ్యమయ్యాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

