పారదర్శకంగా..పాస్‌పోర్టు వెరిఫికేషన్
పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తూ తెలంగాణ పోలీసులు అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
- దరఖాస్తులు పెరిగినా తగ్గని వేగం
- జీరో పెండెన్సీతో దేశానికే ఆదర్శం
- 4 రోజుల్లోపే పోలీస్ వెరిఫికేషన్ పూర్తి
- గత ఏడాది 6.5 లక్షల పాస్‌పోర్టులు జారీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తూ తెలంగాణ పోలీసులు అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో జీరో పెండెన్సీ ఉండటం పోలీసుల పనితీరుకు అద్దం పడుతున్నది. గతంలో పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు వారం కంటే ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడా సమస్య లేదు. కేవలం 3, 4 రోజుల్లోనే విచారణ పూర్తవుతున్నది. ఇలా గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6.59 లక్షల పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఇంత భారీ స్థాయిలో పాస్‌పోర్టులు జారీ అయ్యాయంటే దానికి వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరగటమే కారణం. పాస్‌పోర్టు కార్యాలయం నుంచి పోలీస్ విభాగానికి పాస్‌పోర్టు దరఖాస్తుదారుడి దరఖాస్తు అందిన వెంటనే, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పారదర్శకంగా సదరు వ్యక్తి సర్టిఫికెట్లు, స్థానిక పరిస్థితులను పరిశీలించి వెరిఫికేషన్ రిపోర్టును పాస్‌పోర్టు కార్యాలయానికి అందిస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన దరఖాస్తులు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీస్థాయిలో దరఖాస్తులు పెరిగాయి. అయినా గరిష్ఠంగా 4 రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నారు. 2021 (1,17,284)తో పోలిస్తే 2022లో(1,87,440) 70 వేల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. అయినా వెరిఫికేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తూ, ప్రజలకు వేగంగా సేవలు అందిస్తున్నారు.
పోలీసుల సహకారంతో వేగంగా పాస్‌పోర్టులు
తెలంగాణ వ్యాప్తంగా 2022లో 6.59 లక్షల పాస్‌పోర్టులు జారీ చేశాం. ఇందులో పోలీసుల సహకారం భేష్. గతంలో దరఖాస్తుదారులు పాస్‌పోర్టుల కోసం బ్రోకర్లను ఆశ్రయించేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి పాస్‌పోర్టు ప్రక్రియపై అవగాహన కల్పించాం. నేరుగా దరఖాస్తుదారులే పాస్‌పోర్టు వెబ్సైట్ ద్వారా సేవలు పొందుతున్నారు.
– దాసరి బాలయ్య, హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు అధికారి
వేగంగా వెరిఫికేషన్ ప్రక్రియ
పాస్‌పోర్టు వెరిఫికేషన్ వేగంగా, పారదర్శకంగా కొనసాగుతున్నది. 2021 కంటే 2022లో 70 వేల దరఖాస్తులు అధికంగా వచ్చినా, 4 రోజుల్లోపే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. దరఖాస్తుదారులు తమ దరఖాస్తుకు సంబంధించిన వెరిఫికేషన్, అప్లికేషన్ స్టేటస్‌ను ఆన్లైన్లో (www.passportindia.gov.in) తనిఖీ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌పై అవగాహనలేని వాళ్లు, వృద్ధులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని పాస్‌పోర్టు వెరిఫికేషన్ విభాగం (040-27852606)కు ఫోన్ చేస్తే స్టేటస్ చెప్తారు. దరఖాస్తుదారుడికి ముందే సమాచారం ఇచ్చి, వాళ్ల ఇంటికి వెళ్లి వెరిఫికేషన్‌ను పాదర్శకంగా పూర్తి చేస్తున్నాం.
– విశ్వప్రసాద్, జాయింట్ సీపీ,హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ (ఎస్బీ)
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

