నిధుల గోల్మాల్పై పంచాయితీ
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ బూతుల నిర్వహణకు వచ్చిన నిధుల చెల్లింపుల్లో కార్యదర్శులు, ఎంపీవో మధ్య ముదిరిన పంచాయితీ ఫిర్యాదుల వరకు వెళ్లింది.
- అధికారులకు తలనొప్పిగా మారిన ఎంపీవో, కార్యదర్శుల పంచాయితీ
- ఇరువురి మధ్య పరస్పర ఆరోపణలు
- డీపీవో, కలెక్టర్ దృష్టికి చేరిన పంచాయితీ
- విచారణ చేపట్టిన డీఎల్పీవో… ఎంపీవోపై చర్యలకు రంగం సిద్ధం
అందోల్, జూన్ 8: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ బూతుల నిర్వహణకు వచ్చిన నిధుల చెల్లింపుల్లో కార్యదర్శులు, ఎంపీవో మధ్య ముదిరిన పంచాయితీ ఫిర్యాదుల వరకు వెళ్లింది. ఇరువురి పరస్పర ఆరోపణల విషయం జిల్లా పంచాయతీ అధికారితో పాటు కలెక్టర్ వరకు చేరింది. ఈ పంచాయితీ అధికారులకు తలనొప్పిగా మారడంతో డీఎల్పీవో కార్యదర్శులతో పాటు ఎంపీవోను రహస్యంగా విచారణ చేశారు. అందోల్ మండలంలో మొత్తం 39 పోలింగ్ కేంద్రాలుండగా ఒక్కో కేంద్రానికి రూ.3 వేల చొప్పున మొత్తం రూ.లక్షా 80 వేలు ఎన్నికల ఖర్చు కింద నిధులు వచ్చాయి.
ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీవో మాకు ఇవ్వకుండా తన వద్దే పెట్టుకున్నారని, ఈ విషయంపై పలుమార్లు అడగ్గా ఆ డబ్బుల గురించి అడగొద్దు.. ఏమైనా ఉంటే మీ పంచాయతీల్లో చూసుకోండి అటూ సమాధానం ఇవ్వడంతోపాటు అన్ని విషయాల్లో ఇబ్బందులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతన్నట్లు కార్యదర్శులు ఎంపీవోపై డీఎల్పీవోకు విన్నవించారు. ఎంపీవో మాత్రం పంచాయతీల్లో పనుల లెక్కలు సరిగా ఉంచాలని అడగ్గా కార్యదర్శులు నాపై కక్ష కట్టారని డీఎల్పీవోకు వివరించారు. ఈ విషయంపై డీఎల్పీవో సంజీవరావు మాట్లాడుతూ ఎంపీవోపై పంచాయతీ కార్యదర్శులు ఫిర్యాదు చేసిన విషయంపై విచారణకు వెళ్లామని తెలిపారు. పూర్తి విచారణ అంశాలను డీపీవోతోపాటు కలెక్టర్కు అందించామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

