మొలకలు.. ఆరోగ్య సిరులు
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు.
- విటమిన్లు, ఖనిజాలు పుష్కలం
- 35 శాతం మాంసకృత్తులు
- కొలెస్ట్రాల్‌ను కట్టడి చేస్తాయి
- రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
- చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి
- రోజురోజుకూ పెరుగుతున్న వినియోగం
టేక్మాల్, డిసెంబర్, 19: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. పనిభారమో.. ఒత్తిడి వల్లనో చిరు తిండ్లు, ఇన్స్టాంట్ ఆహార పదార్థాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతటి హాని జరుగుతుందో ఆలోచించలేక పోతున్నారు. నేటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు అందించే మంచి ఆహారాల్లో ఒకటి మొలకెత్తిన విత్తనాలు.
గింజలను నీటిలో కొన్ని గంటల పాటు నానబెడితే అవి మొలకలుగా పెరుగుతాయి. సరైన తేమ, తగినంత ఉష్ణోగ్రత ఆ విత్తనాలకు అందిస్తే వాటి నుంచి మొలకలు రావడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియకు రెండు నుంచి ఏడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. నానపెట్టిన గింజలు మొలకలుగా మారే క్రమంలో వాటి పోషక విలువలు రెట్టింపు అవుతాయి. ప్రొటీన్లు, మెగ్నీషియం, పాస్పరస్, మాంగనీస్, విటమిన్-సీ, కే లాంటివి మొలకెత్తిన గింజల్లో ఉంటాయి. ఇవే కాకుండా అమైనో ఆమ్లాలు అధిక స్థాయిలో కలిగి ఉంటాయి.

ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన
వివిధ ఆరోగ్య ప్రయోజనాలుగుండెకు హానికరమైన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి మొలకెత్తిన గింజలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. మొలకలుగా మారిన వాటిలో ఉండే సల్ఫోరఫనే సమ్మేళనం కారణంగా ప్లాస్మా యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ స్థాయిని పెంచుతాయి. అలాగే వీటిల్లో ఉండే ఫైటో ఎరోజెన్ గుండె నొప్పి రాకుండా కాపాడుతుంది.
మొలకెత్తిన విత్తనాలను పెంచే విధానం
- గింజలను నానపెట్టే ముందు వాటిని శుభ్రంగా కడిగి పెద్ద గిన్నె లేదా
జారులో ఉంచాలి. - గింజలు మొత్తం మునిగేలా తగినంత నీటితో నింపాలి.
- రకాన్ని బట్టి గది 3 నుంచి 12 గంటల పాటు ఉష్ణోగ్రతలో ఉంచాలి.
- నీటిలో నుంచి గింజలను తీసి పలుచటి బట్టలో కట్టి, నీరులేకుండా ఒక చోట కదపకుండా ఒకటిన్నర రోజు ఉంచడం ద్వారా అంగుళంపైన మొలకలు వస్తాయి.
- మొలకలు వచ్చిన తరువాత వాటిని తాజా నీటితో కడిగి అప్పుడే లేదా 3 నుంచి 5 రోజుల్లోగా ఆహారంగా
తీసుకోవాలి.
జీర్ణక్రియ సామర్థ్యం పెరుగుతుంది
మొలకలు సులభంగా జీర్ణం అవుతాయి. వీటిలో ఉండే ఎంజైమ్స్ జీర్ణక్రియ రేటుని పెంచుతాయి. సజీవ ఎంజైమ్స్ ఉండటం వల్ల శరీరంలోని రసాయన చర్యలను మెరుగుపరిచి, మనం తీసుకున్న ఆహారాన్ని విచ్ఛినం చేసి జీర్ణ వాహిక ద్వారా పోషకాలను మన శరీరంలోకి నేరుగా చేరడానికి దోహదం చేస్తాయి. పీచు అధిక మొత్తంలో ఉండటంతో మలవిసర్జన సజావుగా సాగేలా చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

క్యాన్సర్ నిరోధిస్తుంది..
బ్రకోలి మొలకలలోని ప్రధాన సమ్మేళనాలైన గ్లూకోసైనోట్స్ మనం తీసుకున్న తరువాత విచ్ఛిన్నమై ఐసోథియోసైనేట్స్గా మారుతాయి. ఇవి యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్లమేటరీ లక్షణాలు అధికంగా కలిగి ఉంటాయి. బ్రకోలి గింజలు క్యాన్సర్‌ను నిరోధించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయని ఒక అధ్యయనంలో తేలింది.

రోజువారి ఆహారంతో తీసుకోవచ్చు
మొలకెత్తిన గింజలను పచ్చిగా తినడానికి ఇష్టపడని వారు తేనె, ఖర్జూర, నిమ్మరసం, ఎండు ద్రాక్ష, ఉల్లిపాయలు, దానిమ్మ గింజలతో కలిపి తీసుకోవచ్చు.మొలకలను నేరుగా తిన్నప్పుడే వాటిలో ఉండే పోషక విలువలు మన శరీరంలోకి నేరుగా చేరుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి
మొలకెత్తిన గింజల్లో ఉండే విటమిన్-సి తెల్ల రక్త కణాలు చురుకుగా పనిచేయడానికి సహకరిస్తుంది.. తరుచుగా సంక్రమించే వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతో, మానవ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మొలకలను తరుచుగా తీసుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేసి, చెడు రక్తం వల్ల కలిగే హానిని తగ్గిస్తుంది.
చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి
మొలకలలో ఐరన్, కాపర్, మాంగనీస్, పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇవి ఎర్రరక్త కణాలను వృద్ధి చేయడానికి తోడ్పడుతాయి. మొలకలు శరీరంలోని అమైలేజ్ ఎంజైమ్‌లను నియంత్రణలో ఉంచి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీంతో రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. టైప్ టు మధుమేహంతో బాధపడేవారికి అవసరమైన గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

